T20 World Cup 2021 : నేడే టీ20 వ‌రల్డ్ క‌ప్ 2021 ఫైన‌ల్‌.. క‌ప్ ఎవ‌రు కొట్ట‌నున్నారు ?

T20 World Cup 2021 : గ‌త కొద్ది రోజులుగా యూఏఈలో ఐసీసీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ ఎంతో ఉత్సాహంగా కొన‌సాగిన విష‌యం విదిత‌మే. ఈ టోర్న‌మెంట్‌లో అనేక జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అయితే భార‌త్ స‌హా, హేమాహేమీలుగా ఉన్న కొన్ని జ‌ట్లు సెమీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించ‌లేక బొక్క బోర్లా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో సెమీ ఫైన‌ల్‌లో విజేత‌లుగా నిలిచిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య నేడు ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దుబాయ్‌లో రాత్రి 7.30 గంట‌ల‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవ‌రు గెలుస్తారు ? క‌ప్ ఎవ‌రు కొడ‌తారు ? అని క్రికెట్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే గ‌త మ్యాచ్‌ల‌ను ప‌రీక్షిస్తే ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌ల‌లో ఆస్ట్రేలియానే ఎల్ల‌ప్పుడూ పైచేయి సాధిస్తూ వ‌స్తోంది. గ‌తంలో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ప‌లు టోర్నీల్లో జ‌రిగిన నాకౌట్ మ్యాచ్‌ల‌లో మొత్తం 17 మ్యాచ్‌ల‌కు గాను 16 మ్యాచ్‌ల‌లో ఆస్ట్రేలియానే విజ‌యం సాధించింది. దీంతో ఆస్ట్రేలియానే ఫేవ‌రెట్ అని అంటున్నారు. అయితే ఇది టీ20 క్రికెట్ క‌నుక ఎలాంటి సంచ‌ల‌నాలు అయినా న‌మోదు కావ‌చ్చు. న్యూజిలాండ్ కూడా మేటి బౌల‌ర్లు, బ్యాట్స్‌మెన్ తో దుర్బేధ్యంగా ఉంది. క‌నుక ఆ జ‌ట్టును కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్దు.

ఇక టైటిల్ ఫేవ‌రెట్ ఆస్ట్రేలియా అయిన‌ప్ప‌టికీ న్యూజిలాండ్‌ను కూడా చాలా మంది స‌పోర్ట్ చేస్తున్నారు. ఎలాగైనా క‌ప్ సాధించాల‌ని కేన్ విలియ‌మ్స‌న్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జ‌ట్టు శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తోంది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్టును రెండో జ‌ట్టు 150-160 ప‌రుగుల‌కు క‌ట్ట‌డి చేస్తే విజ‌యం సాధించ‌డం సుల‌భ‌మే అని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్టు విజ‌యం సాధించాలంటే.. క‌నీసం 180 ప‌రుగులు అయినా చేయాల‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే స్కోరుపైనే మ్యాచ్ ఫ‌లితం ఆధార ప‌డి ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇక తుది జ‌ట్టులో ఆస్ట్రేలియాలో.. డేవిడ్ వార్న‌ర్‌, ఆరోన్ ఫించ్‌, మిచెల్ మార్ష్‌, స్టీవెన్ స్మిత్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, మార్క‌స్ స్టాయినిస్‌, మాథ్యూ వేడ్‌, ప్యాట్ క‌మ్మిన్స్‌, మిచెల్ స్టార్క్‌, ఆడ‌మ్ జంపా, జోష్ హేజ‌ల్‌వుడ్ ఉంటార‌ని తెలుస్తోంది. ఆస్ట్రేలియా మార్పులేమీ లేకుండానే ఫైన‌ల్ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగుతుంద‌ని తెలుస్తోంది.

ఇక న్యూజిలాండ్ తుది జ‌ట్టులో.. మార్టిన్ గ‌ప్తిల్‌, డెరిల్ మిచెల్‌, కేన్ విలియ‌మ్స‌న్‌, టిమ్ స్టెయిఫెర్ట్‌, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీష‌మ్‌, మిచెల్ స్టాన్ట‌న‌ర్‌, టిమ్ సౌతీ, ఆడ‌మ్ మిల్నె, ట్రెంట్ బౌల్ట్‌, ఇష్ సోధీ.. ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM