Varun Tej : మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి ఆ తరువాత వెండి తెరపై హీరోయిన్ గా సందడి చేసింది. అయితే మెగా అభిమానులు ఈమెను హీరోయిన్ గా మాత్రం ఆహ్వానించలేదు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న నిహారిక వివాహం తర్వాత నిర్మాతగా మారింది.
నిహారిక నిర్మాతగా “ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ” అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19వ తేదీన జీ 5లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మెగా హీరో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ నిహారిక గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
నిహారిక ఎన్నో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే తనకి ఎప్పుడూ ఇది చెయ్యి, అది చెయ్యి.. అంటూ సలహాలు ఇవ్వనని.. తన విషయంలో ఏ మాత్రం ఇన్వాల్వ్ కాననీ.. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపాడు.
ఇక ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసిన తరవాత ఎంతో షాకయ్యానని ఈ ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేశాడు. ఈ సిరీస్ లో సంగీత శోభన్, తులసి, సీనియర్ నరేష్, సిమ్రాన్ శర్మ, గెటప్ శ్రీనులు కీలక పాత్రలలో నటించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…