Varun Tej : నిహారిక విషయంలో నేను ఎలాంటి సలహాలు ఇవ్వను.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్..!

November 14, 2021 2:58 PM

Varun Tej : మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి ఆ తరువాత వెండి తెరపై హీరోయిన్ గా సందడి చేసింది. అయితే మెగా అభిమానులు ఈమెను హీరోయిన్ గా మాత్రం ఆహ్వానించలేదు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న నిహారిక వివాహం తర్వాత నిర్మాతగా మారింది.

Varun Tej said that he will not intervene in niharika matters

నిహారిక నిర్మాతగా “ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ” అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19వ తేదీన జీ 5లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మెగా హీరో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ నిహారిక గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

నిహారిక ఎన్నో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అయితే తనకి ఎప్పుడూ ఇది చెయ్యి, అది చెయ్యి.. అంటూ సలహాలు ఇవ్వనని.. తన విషయంలో ఏ మాత్రం ఇన్వాల్వ్ కాననీ.. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపాడు.

ఇక ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసిన తరవాత ఎంతో షాకయ్యానని ఈ ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేశాడు. ఈ సిరీస్ లో సంగీత శోభన్, తులసి, సీనియర్ నరేష్, సిమ్రాన్ శర్మ, గెటప్‌ శ్రీనులు కీలక పాత్రలలో నటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now