Manchu Lakshmi : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ చిత్రంలో మంచు లక్ష్మీ..!

November 14, 2021 2:22 PM

Manchu Lakshmi : మలయాళ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు తెలుగులో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మోహన్ లాల్ నటించే సినిమాలు కూడా తెలుగులోనూ మంచి ఆదరణను దక్కించుకుంటున్నాయి. ఇక తాజాగా మోహన్ లాల్ హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ తరహాలో  ‘మాన్‌స్టర్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మోహన్ లాల్ లక్కీ సింగ్‌గా సర్దార్జీ పాత్రలో కనిపించనున్నారు.

Manchu Lakshmi to act in mohan lal movie

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మోహన్ లాల్ కుటుంబంతో మంచు మోహన్ బాబు కుటుంబానికి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ రెండు కుటుంబాలు పరస్పరం స్నేహ బంధంతో మెలుగుతుంటాయి. ఈ క్రమంలోనే మోహన్ లాల్ నటిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని మంచు లక్ష్మికి కల్పించారు.

ఈ సినిమాలో మంచు లక్ష్మి ఒక ప్రధానమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను 40 రోజులలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర ఎలా ఉంటుంది ? ఏమిటి.. అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now