కరోనా తీవ్రరూపం దాల్చిన దశలో ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరైతే అతి జాగ్రత్తలు పాటించబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కొందరు ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కరోనా రావొద్దని చెప్పి రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కషాయాలు, మూలికలను తీసుకోవడం, వివిధ రకాల పండ్లు, ఆహారాలను తినడం మామూలే. అయితే ఆ యువకుడు మాత్రం వినూత్నంగా ఆలోచించి ఓ చిట్కా పాటించాడు. దీంతో ప్రాణాలను కోల్పోయాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మచ్చ బొల్లారం పరిధిలోని చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్ (30) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగితే కరోనా రాదని ఎవరో చెప్పగా విన్న సలహాతో సురేశ్ కూడా అలాగే చేశాడు. అతను అలా తాగడమే కాక అతని భార్య సంధ్య, తల్లి లక్ష్మి కూడా తాగారు. ఈ విధంగా వారు కొంతకాలంగా తాగుతున్నారు.
అయితే తాజాగా వారు యథావిధిగా పాలలో నల్ల ఉప్పు వేసుకొని తాగారు. కొద్దిసేపటికే ముగ్గురూ వాంతులు చేసుకున్నారు. దీంతో స్థానికులు వారిని సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ పరిస్థితి విషమంగా ఉండగా అతన్ని అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. కాగా అతని భార్య, తల్లికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్‌లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…