Malavika Mohanan : నువ్వు ఆ ప‌నిచేసేందుకే ప‌నికొస్తావ‌న్న నెటిజ‌న్‌.. దీటుగా రిప్లై ఇచ్చిన బ్యూటీ..!

May 19, 2022 1:16 PM

Malavika Mohanan : సోష‌ల్ మీడియాలో మాళ‌విక మోహ‌నన్ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఈ అమ్మ‌డు అందులో చేసే అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతుంటాయి. ఈమె సినిమాల్లోకి రాక ముందు మోడ‌ల్ కావ‌డంతో ఆమె స్వ‌త‌హాగానే అధిక సంఖ్య‌లో ఫాలోవ‌ర్ల‌ను కలిగి ఉంది. అందులో భాగంగానే త‌ర‌చూ ఈమె ఫొటోషూట్స్ చేస్తుంటుంది. అలాగే మ్యాగ‌జైన్ల క‌వ‌ర్ ఫొటోల‌కు పోజులు ఇస్తుంటుంది. అయితే మాళ‌విక మోహ‌న‌న్‌పై ఓ నెటిజ‌న్ అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. అయితే అందుకు ఆమె దీటుగా రిప్లై ఇచ్చింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

మాళ‌విక మోహ‌న‌న్‌ను ఉద్దేశించి ట్విట్ట‌ర్‌లో ఓ వ్య‌క్తి అస‌భ్య‌మైన కామెంట్ పెట్టాడు. నువ్వు కేవ‌లం గ్లామ‌ర్ ఫొటోషూట్స్ మాత్ర‌మే చేసి ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంటున్నావు, నీకు అస‌లు యాక్టింగ్ రాదు, నీకు టాలెంట్ లేదు, జీరో టాలెంటెడ్ ప‌ర్స‌న్‌వి నువ్వు, కేవ‌లం అందాల ఆర‌బోత‌తోనే నువ్వు పాపుల‌ర్ అయ్యావు, ఆ ప‌ని చేసేందుకే నువ్వు ప‌నికొస్తావు, సినిమాల‌కు ప‌నికిరావు.. అని ఓ నెటిజ‌న్ ఆమెకు ట్వీట్ చేశాడు. అయితే దీనికి మాళ‌విక మోహ‌న‌న్ స్ట్రాంగ్‌గా బ‌దులిచ్చింది.

Malavika Mohanan given strong reply to a netizen who commented on her
Malavika Mohanan

అయితే నువ్వు మ‌రి నా ఫొటోషూట్స్ కోసం న‌న్ను ఫాలో అవుతున్నావా.. లేక ట్విట్ట‌ర్‌లోనే న‌న్ను ఫాలో అవుతున్నావా.. అంటూ ఆమె దీటుగా స‌మాధానం చెప్పి ఆ నెటిజ‌న్ నోరు మూయించింది. ఇక మాళ‌విక మోహ‌న‌న్ ఓ వైపు గ్లామ‌ర్ ఫొటోషూట్స్ చేస్తూనే మ‌రోవైపు సినిమాల్లో బిజీగా మారింది. ఈమె విజ‌య్‌తో క‌లిసి న‌టించిన మాస్ట‌ర్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అయితే త‌రువాత ధ‌నుష్‌తో క‌లిసి చేసిన మార‌న్ అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ఇక ఈమె ప్ర‌స్తుతం సిద్ధాంత్ చ‌తుర్వేదితో క‌లిసి యుధ్ర అనే హిందీ మూవీలో న‌టిస్తోంది. అలాగే ప్ర‌భాస్ మూవీలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని అంటున్నారు. కానీ దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment