Kriti Sanon : ఆ పని చేయనని నిర్మొహమాటంగా చెప్పిన మహేష్ హీరోయిన్..!

October 1, 2021 9:17 PM

Kriti Sanon : మహేష్ బాబు హీరోగా నంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా పరిచయమైన బ్యూటీ కృతి సనన్. ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో ఈమె బాలీవుడ్ వైపు పయనించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉంది.

Kriti Sanon : ఆ పని చేయనని నిర్మొహమాటంగా చెప్పిన మహేష్ హీరోయిన్..!

కాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రంలో నటిస్తోంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా తన ఆడిషన్ కి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇందులో తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో మాత్రం స్మైల్ మిస్ కాకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే అందులో అడిగిన ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ ఎంతో తెలివిగా సమాధానం చెప్పింది. స్విమ్మింగ్ వచ్చా అని అడగగా.. వచ్చు.. అని సమాధానం చెబుతూనే టూ పీస్ (బికినీ) డ్రెస్ లో మాత్రం కంఫర్ట్ గా ఉండనని, ఈ సందర్భంగా పరోక్షంగా బికినీ వేసుకోనని ఈమె తెలియజేసింది. ఇక ఈమె నటించిన ‘మిమి’లో సరోగేట్ మదర్‌గా కనిపించి విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now