శనివారం, జూలై 4, 2026
వార్తలు

KGF Krishna Ji : కేజీఎఫ్‌లో అంధుడిగా క‌నిపించిన తాత బ్యాక్‌ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

KGF Krishna Ji : కన్న‌డ సూప‌ర్ హిట్ చిత్రం కేజీఎఫ్ 2 ఇంటా, బ‌య‌టా అద‌ర‌గొడుతోంది. ఈ సినిమా రాబ‌డుతున్న క‌లెక్ష‌న్స్ చూసి విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం కేజీఎఫ్ 2 గురించే మాట్లాడుకుంటున్నారు. యశ్…

KGF Krishna Ji : కేజీఎఫ్‌లో అంధుడిగా క‌నిపించిన తాత బ్యాక్‌ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

KGF Krishna Ji : కన్న‌డ సూప‌ర్ హిట్ చిత్రం కేజీఎఫ్ 2 ఇంటా, బ‌య‌టా అద‌ర‌గొడుతోంది. ఈ సినిమా రాబ‌డుతున్న క‌లెక్ష‌న్స్ చూసి విశ్లేష‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం కేజీఎఫ్ 2 గురించే మాట్లాడుకుంటున్నారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరినీ, వారి నటననీ అభినందిస్తున్నారు ప్రేక్షకులు. హీరో, హీరో తల్లి, అధీరా పాత్ర, రమైకా సేన్ పాత్ర ఇలా సినిమాలోని ముఖ్య పాత్రలందర్నీ నెటిజన్లు, ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ముఖ్యమైన పాత్రలలో నటించిన వారి వివరాలను ప్రేక్షకులు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

KGF Krishna Ji interesting facts about him
KGF Krishna Ji

ఈ సినిమాలో అంధుడిగా క‌నిపించిన తాత పేరు కృష్ణాజీ. ఆంధ్ర – కర్ణాటక స‌రిహ‌ద్దుకు చెందిన వారు. సినిమాలపై ఆసక్తితో చిన్ననాటి నుండే ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూస్తూ కృష్ణాజీ పెరిగారు. సినిమాల్లోకి రావ‌ల‌నుకున్న ఆయ‌న శిక్ష‌ణ కూడా తీసుకున్నారు. కొంతకాలం సినిమా వాళ్లకు దుస్తులు కుట్టిన ఆయ‌న‌కు భీమ్ వెంకటేష్ అనే హీరో కమ్ ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడింది. కొంత‌కాలం అత‌ని ద‌గ్గ‌ర ప‌ని చేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ మేకప్ బాయ్ తో పరిచయం ఏర్పడగా ఆయన వద్ద టచప్ బాయ్ గా పనిచేశాడు.

అనంత‌రం శంకర్ నాగ్ దగ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేరాడు. శంకర్ నాగ్ దగ్గర పనిచేస్తున్న సమయంలోనే కృష్ణాజీకి కేజీఎఫ్ లో నటించే అవకాశం వచ్చింది. ఛాన్స్ రావ‌డం, పాత్ర‌లో ఒదిగి పోవ‌డం, ప్ర‌తి ఒక్క‌రి ప్ర‌శంస‌లు పొంద‌డం జ‌రిగింది. ఈ కథలో అందరూ మెచ్చుకునే పాత్ర ఇంకొక‌టి ఉంది. అదే ఇనాయత్ ఖలీల్. కథని మలుపు తిప్పే ఈ పాత్రలో నటించింది మన టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నటుడి తండ్రి. తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం కేజీఎఫ్ 2లో ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించారు. ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ నటించకపోవడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి