గురువారం, జూన్ 25, 2026
వార్తలు

Keerthy Suresh : కీర్తి సురేష్ రెమ్యున‌రేష‌న్ మ‌రీ అంత‌నా ?

Keerthy Suresh : మ‌హాన‌టి సినిమాతో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న కీర్తి సురేష్‌కు ఆ త‌రువాత ఆఫ‌ర్లు కూడా ఎక్కువ‌గానే వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌లు భారీ ప్రాజెక్టుల‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన ర‌జ‌నీకాంత్ మూవీ పెద్ద‌న్న‌లోనూ…

Keerthy Suresh : కీర్తి సురేష్ రెమ్యున‌రేష‌న్ మ‌రీ అంత‌నా ?

Keerthy Suresh : మ‌హాన‌టి సినిమాతో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న కీర్తి సురేష్‌కు ఆ త‌రువాత ఆఫ‌ర్లు కూడా ఎక్కువ‌గానే వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌లు భారీ ప్రాజెక్టుల‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే విడుద‌లైన ర‌జ‌నీకాంత్ మూవీ పెద్ద‌న్న‌లోనూ ఆమె న‌టించింది. అందులో ర‌జ‌నీకి ఆమె చెల్లెలి పాత్ర‌లో న‌టించింది.

Keerthy Suresh reportedly took rs 2 crore remuneration for peddanna movie

అయితే పెద్ద‌న్న మూవీలో న‌టించినందుకు గాను కీర్తి సురేష్ ఏకంగా రూ.2 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌హానటి మూవీ ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో కీర్తి సురేష్ రేంజ్ ఒక్క‌సారిగా పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. దాంతో ఆమె ఆ మూవీ అనంత‌రం ఎక్కువ‌గానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక పెద్ద‌న్న మూవీకి రూ.2 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ మూవీలో ఆమె రోల్ కీల‌కం. క‌నుక ఆమె అంత మొత్తంలో తీసుకుంద‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే ఆమె కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న అధిక మొత్తం ఇదేన‌ని అంటున్నారు.

ఇక కీర్తి సురేష్ ప్ర‌స్తుతం భోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కూడా న‌టిస్తున్నారు. ఈ మూవీని ఇటీవ‌లే లాంచ్ చేయగా.. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌రుపుకోనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి