Kangana Ranaut : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే గురువారం అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను విధించింది. ఇక ఆర్యన్ ఖాన్‌కు సపోర్ట్‌గా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. కొందరు షారుఖ్ ఖాన్‌ను కలిసి ఓదారుస్తున్నారు. అయితే తాజాగా హృతిక్ రోషన్ కూడా ఆర్యన్ ఖాన్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. దీంతో కంగనా రనౌత్ ఎంటర్ అయ్యారు.
ఆర్యన్ ఖాన్ కు సపోర్ట్ ఇస్తున్న అందరూ మాఫియా పప్పు అని ఆమె వ్యాఖ్యానించారు. మనుషులు తప్పులు చేస్తుంటారని, అయితే తప్పులు చేసే వాళ్లను ఇలా పొగడడమేమిటి ? అని అన్నారు. ఇప్పటికైనా అతను చేసిన పనులకు అతనికి బుద్ధి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆర్యన్ ఖాన్ తప్పు చేశాడని, కానీ ఆ తప్పులను తెలుసుకుని ఉన్నతమైన వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నానని తెలిపారు.
తప్పు చేసిన వాళ్లను వెనకేసుకు వచ్చే వారందరూ నేరస్థులే అని కంగనా వ్యాఖ్యానించారు. కాగా ఆర్యన్ ఖాన్‌కు ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసానే ఖాన్, పూజా భట్, సుచిత్ర కృష్ణమూర్తి వంటి వారు సపోర్ట్‌ను ఇచ్చారు.
అయితే ఆర్యన్‌కు మద్దతుగా హృతిక్ రోషన్ పోస్టు పెట్టడం వల్లే ఆమె ఇలా మధ్యలోకి ఎంట్రీ అయిందని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…