Kangana Ranaut : షారుఖ్ కుమారుడు ఆర్య‌న్‌కు హృతిక్ రోష‌న్ స‌పోర్ట్‌.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగ‌నా..

October 7, 2021 11:29 PM

Kangana Ranaut : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. అయితే గురువారం అత‌నికి కోర్టు 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్‌ను విధించింది. ఇక ఆర్య‌న్ ఖాన్‌కు స‌పోర్ట్‌గా చాలా మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. కొంద‌రు షారుఖ్ ఖాన్‌ను క‌లిసి ఓదారుస్తున్నారు. అయితే తాజాగా హృతిక్ రోష‌న్ కూడా ఆర్య‌న్ ఖాన్‌కు స‌పోర్ట్‌గా నిలిచాడు. దీంతో కంగ‌నా ర‌నౌత్ ఎంట‌ర్ అయ్యారు.

Kangana Ranaut comments on aryan khan

ఆర్య‌న్ ఖాన్ కు స‌పోర్ట్ ఇస్తున్న అంద‌రూ మాఫియా ప‌ప్పు అని ఆమె వ్యాఖ్యానించారు. మ‌నుషులు త‌ప్పులు చేస్తుంటార‌ని, అయితే త‌ప్పులు చేసే వాళ్ల‌ను ఇలా పొగ‌డ‌డ‌మేమిటి ? అని అన్నారు. ఇప్ప‌టికైనా అత‌ను చేసిన ప‌నుల‌కు అత‌నికి బుద్ధి రావాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. ఆర్య‌న్ ఖాన్ త‌ప్పు చేశాడ‌ని, కానీ ఆ త‌ప్పుల‌ను తెలుసుకుని ఉన్న‌తమైన వ్య‌క్తిగా మారాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.

త‌ప్పు చేసిన వాళ్ల‌ను వెన‌కేసుకు వ‌చ్చే వారంద‌రూ నేర‌స్థులే అని కంగ‌నా వ్యాఖ్యానించారు. కాగా ఆర్య‌న్ ఖాన్‌కు ఇప్ప‌టికే అనేక మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు మ‌ద్ద‌తుగా నిలిచారు. హృతిక్ రోష‌న్‌, ఆయ‌న మాజీ భార్య సుసానే ఖాన్‌, పూజా భ‌ట్‌, సుచిత్ర కృష్ణ‌మూర్తి వంటి వారు స‌పోర్ట్‌ను ఇచ్చారు.

అయితే ఆర్య‌న్‌కు మ‌ద్ద‌తుగా హృతిక్ రోష‌న్ పోస్టు పెట్ట‌డం వ‌ల్లే ఆమె ఇలా మ‌ధ్య‌లోకి ఎంట్రీ అయింద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now