Bigg Boss 5 : బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో రోజు రోజుకూ కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్ మాత్రం ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమంలో సాయి తేజ్ అనే కమెడియన్ గా ఉన్న ఇతను సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారారు.
అయితే తన తండ్రికి కళ్లు కనిపించని నేపథ్యంలో తన ట్రాన్స్ జెండర్ గా ఆపరేషన్ చేయించుకున్న విషయం ఆయనకు తెలియలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే రోజు ఈ విషయాన్ని ప్రియాంక సింగ్ బిగ్ బాస్ వేదికపై నుంచి నాగార్జునతో చెబుతూ ఇప్పటి వరకు తన తండ్రికి ఈ విషయం తెలియదని తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పడానికి ఇంతకన్నా మంచి వేదిక ఉండదు.. అంటూ తన తండ్రికి తాను అమ్మాయిగా మారిన విషయాన్ని తెలియజేసింది.
ఇకపోతే ప్రియాంక సింగ్ పుట్టిన రోజు కావడంతో బిగ్ బాస్ తనకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక సింగ్ తండ్రి తనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన ఆట తీరును ప్రశంసిస్తూనే ముందుగా బాబు సాయి తేజ్ అని పిలిచారు. తన తండ్రి ఇప్పటికీ అలాగే పిలవడంతో ప్రియాంక సింగ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రియాంక సింగ్ గతంలో పడిన బాధలను గుర్తుచేసుకోవడం, తండ్రీ కూతుర్ల మధ్య జరిగిన సంభాషణ బయటపెట్టడంతో ప్రియాంక సింగ్ బోరున విలపించింది. ఇది చూసిన మిగతా కుటుంబ సభ్యులు కూడా కంటతడి పెట్టుకున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…