Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ అయిన ప్రియాంక.. ట్రాన్స్ జెండర్ గా తండ్రి అంగీకరించడంతో..!

October 7, 2021 11:14 PM

Bigg Boss 5 : బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో రోజు రోజుకూ కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్ మాత్రం ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమంలో సాయి తేజ్ అనే కమెడియన్ గా ఉన్న ఇతను సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ్‌ గా మారారు.

Bigg Boss 5 priyanka singh emotional in latest episode

అయితే తన తండ్రికి కళ్లు కనిపించని నేపథ్యంలో తన ట్రాన్స్ జెండర్ గా ఆపరేషన్ చేయించుకున్న విషయం ఆయనకు తెలియలేదు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే రోజు ఈ విషయాన్ని ప్రియాంక సింగ్ బిగ్ బాస్ వేదికపై నుంచి నాగార్జునతో చెబుతూ ఇప్పటి వరకు తన తండ్రికి ఈ విషయం తెలియదని తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పడానికి ఇంతకన్నా మంచి వేదిక ఉండదు.. అంటూ తన తండ్రికి తాను అమ్మాయిగా మారిన విషయాన్ని తెలియజేసింది.

ఇకపోతే ప్రియాంక సింగ్ పుట్టిన రోజు కావడంతో బిగ్ బాస్ తనకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక సింగ్ తండ్రి తనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన ఆట తీరును ప్రశంసిస్తూనే ముందుగా బాబు సాయి తేజ్ అని పిలిచారు. తన తండ్రి ఇప్పటికీ అలాగే పిలవడంతో ప్రియాంక సింగ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రియాంక సింగ్ గతంలో పడిన బాధలను గుర్తుచేసుకోవడం, తండ్రీ కూతుర్ల మధ్య జరిగిన సంభాషణ బయటపెట్టడంతో ప్రియాంక సింగ్ బోరున విలపించింది. ఇది చూసిన మిగతా కుటుంబ సభ్యులు కూడా కంటతడి పెట్టుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now