శనివారం, జూలై 4, 2026
వార్తలు

Jeevitha Rajasekhar : చిక్కుల్లో జీవిత‌ రాజ‌శేఖ‌ర్ దంపతులు.. నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ..!

Jeevitha Rajasekhar : జీవితా రాజ‌శేఖ‌ర్‌కి వివాదాలు కొత్తేమీ కాదు. గ‌తంలో ఎన్నో విష‌యాల‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది జీవిత‌. తాజాగా జీవిత చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కుంది. ఈమెపై కేసు పెట్టింది ఎవ‌రో…

Jeevitha Rajasekhar : చిక్కుల్లో జీవిత‌ రాజ‌శేఖ‌ర్ దంపతులు.. నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ..!

Jeevitha Rajasekhar : జీవితా రాజ‌శేఖ‌ర్‌కి వివాదాలు కొత్తేమీ కాదు. గ‌తంలో ఎన్నో విష‌యాల‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది జీవిత‌. తాజాగా జీవిత చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కుంది. ఈమెపై కేసు పెట్టింది ఎవ‌రో కాదు, జోస్ట‌ర్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ హేమ. జోస్ట‌ర్ ఫిలిం స‌ర్వీసెస్ నుంచి జీవితా రాజ‌శేఖ‌ర్‌లు రూ.26 కోట్ల మేర అప్పు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలున్నాయి. గ‌రుడ వేగ సినిమా కోసం జీవిత‌ రాజశేఖర్‌లు అప్పు అడిగితే జోస్ట‌ర్ ఫిలిం స‌ర్వీసెస్ త‌మ ఆస్తులు తాక‌ట్టు పెట్టుకుని డ‌బ్బు సర్దుబాటు చేసింది.

Jeevitha Rajasekhar facing cheque bounce problems
Jeevitha Rajasekhar

ఇప్పుడు ఆ ఆస్తుల‌ను బినామీల పేర్ల మీద‌కు మార్చుకుని జీవిత‌ రాజశేఖ‌ర్‌లు మోసం చేసినట్లు జోస్ట‌ర్ ఎండీ ఆరోపించారు. జీవిత‌ రాజ‌శేఖర్‌ల‌పై చెక్ బౌన్స్ కేసు న‌డుస్తోంది. ఈ కేసులో న‌గ‌రి కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ల‌ను జారీ చేసింది. కాగా ఈ ఆరోపణలను జీవితా రాజశేఖర్ లు ఖండించారు. మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై నేడు జరగబోయే శేఖర్ సినిమా విలేక‌రుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తాం. అప్పటి వరకు ఎటువంటి కథనాల‌ను ప్రసారం చేయవద్ద‌ని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అని జీవితా రాజశేఖర్ లు మీడియాకు ఇచ్చిన ఒక‌ ప్రకటనలో తెలిపారు.

2017లో రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం గ‌రుడ‌వేగ‌. ఈ చిత్ర నిర్మాణంలో జీవిత‌ రాజ‌శేఖ‌ర్‌ల‌తో పాటు జోస్ట‌ర్ సంస్థ కూడా భాగ‌మైంది. చిత్ర నిర్మాణం కోసం వారు రూ.26 కోట్ల ఆస్తులు అమ్మి మ‌రీ ఇన్వెస్ట్ చేశార‌ని, తీరా ఆ డ‌బ్బుల‌ను జీవిత‌ రాజ‌శేఖ‌ర్ ఇవ్వ‌లేద‌ని జోస్టార్ హేమ తెలిపారు. అంతే కాకుండా జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయ‌ని ఆమె అన్నారు. మ‌రి ఈ విష‌యంలో ఎవ‌రిది త‌ప్పు అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి