Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ అనే మూవీతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనువిందు చేస్తోంది. నటనతో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంతుంది. జాన్వీ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా.. టాలెంట్ తో ఎదిగే ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. అయినా సరే ఇండస్ట్రీలో నెపొటిజం పేరుతో ట్రోల్స్ తప్పడం లేదు జాన్వీకి.
రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జాన్వీ ఈ విధంగా మాట్లాడింది. చాలామందికి నా గురించి దురభిప్రాయం ఉంది. నేను వారసత్వంతో వచ్చి.. స్టార్ డమ్ పొందాలి అని అనుకోవడం లేదని.. అయినా తానేమీ గొప్ప టాలెంట్ ఉన్న దానిని కాకపోవచ్చని, అలాగే గొప్ప అందగత్తెను కూడా కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. కాకపోతే.. తాను షూటింగ్ కు వెళ్తే సెట్స్ లో కష్టపడి పని చేస్తానని అంటోంది జాన్వీ. తను కష్టపడే తత్వమే తనను ఇండస్ట్రీలో నిలబెడుతుందని నమ్ముతున్నానంటోంది. సెట్ లో తాను ఎంత కష్టపడతాను అనేది రక్తంతో రాసివ్వడానికి కూడా వెనకాడనంటోంది.
తనకు అదే పనిని మళ్లీ, మళ్లీ చేయడం బోర్ అని చెబుతూ.. తనకంటూ సవాళ్లను పెట్టుకోవాలని లేదంటే, సమయం వృథా అవుతుందని అనిపిస్తోందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది జాన్వీ కపూర్. ఆమె సౌత్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని, విజయ్ దేవరకొండ జోడీగా నటించబోతుందంటూ.. రకరకాల మాటలు వినిపించాయి కానీ జాన్వీ కపూర్ తో పాటు ఫ్యామిలీ కూడా ఇంత వరకు ఏదీ స్పందించలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…