Janhvi Kapoor : కావాలంటే నా రక్తంతో రాసి ఇస్తా.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు..

October 12, 2022 9:20 PM

Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ అనే మూవీతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనువిందు చేస్తోంది. నటనతో త‌ల్లికి త‌గ్గ కూతురుగా పేరు తెచ్చుకుంతుంది. జాన్వీ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా.. టాలెంట్ తో ఎదిగే ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. అయినా సరే ఇండస్ట్రీలో నెపొటిజం పేరుతో ట్రోల్స్ తప్పడం లేదు జాన్వీకి.

రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జాన్వీ ఈ విధంగా మాట్లాడింది. చాలామందికి నా గురించి దురభిప్రాయం ఉంది. నేను వారసత్వంతో వచ్చి.. స్టార్ డమ్ పొందాలి అని అనుకోవడం లేదని.. అయినా తానేమీ గొప్ప టాలెంట్ ఉన్న దానిని కాకపోవచ్చని, అలాగే గొప్ప అందగత్తెను కూడా కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. కాకపోతే.. తాను షూటింగ్ కు వెళ్తే సెట్స్ లో కష్టపడి పని చేస్తానని అంటోంది జాన్వీ. తను కష్టపడే తత్వమే తనను ఇండస్ట్రీలో నిలబెడుతుందని నమ్ముతున్నానంటోంది. సెట్ లో తాను ఎంత కష్టపడతాను అనేది రక్తంతో రాసివ్వడానికి కూడా వెనకాడనంటోంది.

Janhvi Kapoor sensational comments about her life
Janhvi Kapoor

తనకు అదే పనిని మళ్లీ, మళ్లీ చేయడం బోర్ అని చెబుతూ.. తనకంటూ సవాళ్లను పెట్టుకోవాలని లేదంటే, సమయం వృథా అవుతుందని అనిపిస్తోందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది జాన్వీ కపూర్. ఆమె సౌత్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని, విజయ్ దేవరకొండ జోడీగా నటించబోతుందంటూ.. రకరకాల మాటలు వినిపించాయి కానీ జాన్వీ కపూర్ తో పాటు ఫ్యామిలీ కూడా ఇంత వరకు ఏదీ స్పందించలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now