Niharika Konidela : మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌గా మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది. పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న తెలిసిందే. నిహారిక గురించి తరచుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఆమె కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంటూనే ఉంది. ఆ మధ్యన ఓ పబ్ లో డ్రగ్స్ రైడ్ లో నిహారిక పేరు కూడా వినిపించింది.
అయితే నిహారిక ఆ పబ్ కి కేవలం పార్టీ కోసమే వెళ్లిందని.. పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. పెళ్లి తర్వాత కూడా నిహారిక జోరు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్, జిమ్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది. కానీ ఎప్పుడూ ఈ మెగా డాటర్ బికినిలో కనిపించలేదు. ఊహించని విధంగా నిహారిక తాజాగా బికినీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. మెగా డాటర్ కాబట్టి విమర్శలు వస్తాయని తెలిసినా నిహారిక ఇలా బికినిలో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. నిహారిక ఇటీవల టర్కీకి తన ఫ్రెండ్స్ తో కలసి హాలిడే ట్రిప్ కి వెళ్ళింది.
టర్కీలో హాలిడే ఎంజాయ్ చేస్తూ ఇలా అక్కడ ఒక స్ట్రేంజర్ గర్ల్ తో బికినీలో సెల్ఫీకి ఫోజు ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు ఇలోన. నువ్వు మాట్లాడింది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ నీతో ఉన్నంతసేపు సరదాగా అనిపించింది. మళ్ళీ కలుస్తామేమో చూద్దాం అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నిహారిక బికినిలో కనిపించడంతో విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. బికినీలో ఇలా ఫోటోలు బహిర్గతం చేయడం అవసరమా అంటూ కొందరు విమర్శిస్తుంటే.. మరి కొందరు మాత్రం హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తే తప్పేముంది అంటూ సమర్థిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…