Weight Loss Drink : ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు అధిక రక్తపోటు, డయాబెటిస్, బరువు పెరగడానికి దారి తీస్తున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
చెడు ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని స్వయానా మనమే నాశనం చేసుకుంటున్నాం. దీనికి ఫలితంగా మానసిక ఒత్తిడి, అధిక బరువు వంటి సమస్యల బారినపడుతున్నారు. రోగాల బారిన పడుతూ వేలకు వేలు డబ్బులు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఒత్తిడి, జీవనశైలి, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, హార్మోన్స్ లో అసమతుల్యత ఇలా ఎన్నో రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే మన బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
బరువును అదుపులో ఉంచడానికి ఈ డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ కావలసిన పదార్థాలు 250 గ్రాముల ముల్లంగి, 1 నిమ్మకాయ, 100 గ్రాముల అల్లం, 6 టేబుల్ స్పూన్ల తేనె, 1 స్పూన్ దాల్చినచెక్క పొడి కావాలి. ముల్లంగి, అల్లం కలిపి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోత సహాయంతో రసాన్ని ఒక క్లాసు లోకి తీసుకోవాలి. ఈ జ్యూస్ లో ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఆరు టీ స్పూన్స్ తేనె కలుపుకొని ఆ జ్యూస్ ని ఒక గాజు సీసాలో తీసుకుని ఫ్రిజ్ లో పెట్టి భద్రపరుచుకోవచ్చు.
ప్రతిరోజు భోజనానికి ముందు కనీసం 1 టీ స్పూన్ ఈ రసం తాగితే చాలు. అలా డైరెక్ట్ గా ఈ జ్యూస్ ని త్రాగలేనివారు ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగవచ్చు. ఒక నెల రోజుల వ్యవధిలోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది మీ పొట్టలో ఉన్న అదనపు కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ శరీరంలో ఉండే వ్యర్ధాలను తొలగించి శక్తిని పెంచుతుంది. ఇలా 5 వారాలపాటు చేస్తే మీ పొట్టలో కొవ్వు కరిగి అందమైన శరీరాకృతి మీ సొంతం అవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…