Vikram movie : కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కలయికలో వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ విక్రమ్. ఈ చిత్రం జూన్ నెల 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. విక్రమ్ చిత్రం తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా విడుదలై ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సైలెంట్ గా వచ్చిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దర్శకనిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది.
తమిళంలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తెలుగులో కూడా ఈ చిత్రం బయ్యర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. కమల్ హాసన్ నటన, లోకేష్ కనకరాజ్ టేకింగ్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా ఈ చిత్రానికి అదనపు బలం నిలిచారు. ఇక ఈ సినిమాకి చివర్లో హీరో సూర్య ప్లే చేసిన కామియో రోల్స్ తిరుగులేని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రోలెక్స్ పాత్రలో సూర్య కొన్ని నిమిషాల పాటు సందడి చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
ఈ పాత్రలో భయంకరమైన విలన్ గా సూర్య గెటప్ అదిరిపోయింది అని చెప్పవచ్చు. తాజాగా ఈ పాత్రలో నటించడం పై సూర్య ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆకాశం నీ హద్దురా చిత్రానికి గాను సూర్య ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడుతూ.. నేను ఏం చేసినా ఈ స్థాయిలో నిలబడడానికి స్ఫూర్తిగా నిలిచింది మాత్రం కమల్ హాసన్ సార్ అని సూర్య వెల్లడించారు.
ఆయన ఫోన్ చేసి ఓ అవకాశం ఉంది అని చెప్పినప్పుడు దానిని వదులుకోవాలని నేను అనుకోలేదు. కానీ విక్రమ్ చిత్రంలో రోలెక్స్ పాత్రని మాత్రం చివరి నిమిషంలో అంగీకరించాను. మొదట ఈ పాత్ర నేను చేయనని లోకేష్ కనకరాజ్ కి చెబుదాం అనుకున్నాను. కానీ ఒకే ఒక్క వ్యక్తి కోసం ఆ పాత్ర చేశానని, వ్యక్తి ఇంకెవరో కాదు కమల్ హాసన్ అని సూర్య వేదికపై తెలిపాడు. రోలెక్స్ పాత్రతో సూర్య విలక్షణ నటుడిగా మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని కూడా సూర్య చేయడానికి ఇష్టపడతారు. ఆకాశం నీ హద్దురా, జై భీం చిత్రాలు ఆ కోవకు చెందిన సినిమాలే.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…