Jabardasth : బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో కొన్ని రకాల చీప్ ట్రిక్స్ ప్లే చేసి షోకు రేటింగ్స్ తేవడం కోసం తెగ తాపత్రయ పడ్డారు. కానీ ఆ పద్ధతిని మార్చుకున్నారు. అయితే తాజాగా ప్రసారమైన ఓ స్కిట్ మాత్రం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
గత గురువారం జనవరి 20వ తేదీన ప్రసారమైన జబర్దస్త్ షోలో భాగంగా హైపర్ ఆది వేసిన స్కిట్ ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో పుష్ప మూవీకి స్పూఫ్ గా స్కిట్ చేశారు. ఆది పుష్ప పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో అల్లు అర్జున్ పక్కన నటించిన కేశవను ఈ స్కిట్‌లో నటింపజేశారు. ఈ క్రమంలో కేశవ, ఆది ఇద్దరూ తమ దైన శైలిలో పంచ్ లు వేస్తూ కడుపుబ్బా నవ్వించారు.
కాగా స్కిట్‌లో భాగంగా పలుసార్లు ఆది అనసూయపై డబుల్ మీనింగ్ పంచ్‌లు వేయగా.. అనసూయ లైట్ తీసుకుంది. చూస్తుంటే అనసూయ వాటిని బాగానే ఎంజాయ్ చేసినట్లు అర్థమవుతుంది. ఇక మూవీలో అనసూయ దాక్షాయణి పాత్ర చేయగా.. స్కిట్‌లో శాంతి స్వరూప్ ఆ పాత్రలో నటించాడు. దీంతో అతని గెటప్ చూసి ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు.
ఇక ఈ స్కిట్‌ను అప్‌లోడ్ చేసినప్పటి నుంచి లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. చాలా రోజుల తరువాత ఒక అద్భుతమైన స్కిట్‌తో ఆది అందరినీ కడుపుబ్బా నవ్వించాడని చెప్పవచ్చు. ఈ స్కిట్ తాలూకు వీడియో వైరల్‌గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…