Jabardasth : యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతున్న‌ జ‌బ‌ర్ద‌స్త్ ఆది స్కిట్‌.. పుష్ప స్పూఫ్‌తో తెగ న‌వ్వించేశారు..

January 25, 2022 6:24 PM

Jabardasth : బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షో ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఇటీవ‌లి కాలంలో కొన్ని ర‌కాల చీప్ ట్రిక్స్ ప్లే చేసి షోకు రేటింగ్స్ తేవ‌డం కోసం తెగ తాప‌త్ర‌య ప‌డ్డారు. కానీ ఆ ప‌ద్ధ‌తిని మార్చుకున్నారు. అయితే తాజాగా ప్ర‌సార‌మైన ఓ స్కిట్ మాత్రం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.

Jabardasth  hyper aadi pushpa movie spoof skit trending in youtube

గ‌త గురువారం జ‌న‌వ‌రి 20వ తేదీన ప్ర‌సార‌మైన జ‌బ‌ర్ద‌స్త్ షోలో భాగంగా హైప‌ర్ ఆది వేసిన స్కిట్ ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇందులో పుష్ప మూవీకి స్పూఫ్ గా స్కిట్ చేశారు. ఆది పుష్ప పాత్రను పోషించి ఆక‌ట్టుకున్నాడు. ఇక సినిమాలో అల్లు అర్జున్ ప‌క్క‌న న‌టించిన కేశ‌వను ఈ స్కిట్‌లో న‌టింపజేశారు. ఈ క్ర‌మంలో కేశ‌వ‌, ఆది ఇద్ద‌రూ త‌మ దైన శైలిలో పంచ్ లు వేస్తూ క‌డుపుబ్బా న‌వ్వించారు.

కాగా స్కిట్‌లో భాగంగా ప‌లుసార్లు ఆది అన‌సూయ‌పై డ‌బుల్ మీనింగ్ పంచ్‌లు వేయ‌గా.. అన‌సూయ లైట్ తీసుకుంది. చూస్తుంటే అన‌సూయ వాటిని బాగానే ఎంజాయ్ చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ఇక మూవీలో అన‌సూయ దాక్షాయ‌ణి పాత్ర చేయ‌గా.. స్కిట్‌లో శాంతి స్వ‌రూప్ ఆ పాత్ర‌లో న‌టించాడు. దీంతో అత‌ని గెట‌ప్ చూసి ప్రేక్ష‌కులు తెగ న‌వ్వుకున్నారు.

ఇక ఈ స్కిట్‌ను అప్‌లోడ్ చేసిన‌ప్ప‌టి నుంచి ల‌క్ష‌ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. చాలా రోజుల త‌రువాత ఒక అద్భుత‌మైన స్కిట్‌తో ఆది అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ స్కిట్ తాలూకు వీడియో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now