Jabardasth Avinash : జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా అందరికీ పరిచయమైన ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అరియానాతో ప్రేమలో ఉన్నట్లు వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు పుకార్లు షికార్లు చేశాయి.
ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికి అవినాష్.. అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేస్తూ వీరి నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ క్రమంలోనే నిశ్చితార్థం ఫోటోలు వైరల్ కావడంతో అవినాష్, అరియానా మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని తేలిపోయింది.
అవినాష్ పెళ్లి కొద్ది రోజులే ఉండటంతో ఇప్పటికే అవినాష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే హల్ది, మంగళ స్నానాల కార్యక్రమాలను జరుపుకోవడంతో ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ కార్యక్రమాలకు అవినాష్ సన్నిహితులు హాజరయ్యారు. అవినాష్ కు బెస్ట్ ఫ్రెండ్ గా ప్రముఖ యాంకర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేసింది. ప్రస్తుతం అవినాష్ పెళ్లి వేడుకల్లో శ్రీముఖి పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అవినాష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి అవినాష్ పెళ్లి జరిగిపోయింది కదా.. అంటు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…