Jabardasth Avinash : అవినాష్ పెళ్లి వేడుకల్లో శ్రీముఖి.. ఫోటోలు వైరల్..!

October 20, 2021 5:24 PM

Jabardasth Avinash : జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా అందరికీ పరిచయమైన ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అరియానాతో ప్రేమలో ఉన్నట్లు వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు పుకార్లు షికార్లు చేశాయి.

Jabardasth Avinash marriage function sreemukhi photos viral

ఈ క్రమంలోనే తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికి అవినాష్.. అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేస్తూ వీరి నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ క్రమంలోనే నిశ్చితార్థం ఫోటోలు వైరల్ కావడంతో అవినాష్, అరియానా మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని తేలిపోయింది.

అవినాష్ పెళ్లి కొద్ది రోజులే ఉండటంతో ఇప్పటికే అవినాష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే హల్ది, మంగళ స్నానాల కార్యక్రమాలను జరుపుకోవడంతో ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ కార్యక్రమాలకు అవినాష్ సన్నిహితులు హాజరయ్యారు. అవినాష్ కు బెస్ట్ ఫ్రెండ్ గా ప్రముఖ యాంకర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేసింది. ప్రస్తుతం అవినాష్ పెళ్లి వేడుకల్లో శ్రీముఖి పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అవినాష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి అవినాష్‌ పెళ్లి జరిగిపోయింది కదా.. అంటు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now