Katrina Kaif : చూపు తిప్పుకోని అందం, నెమలి నాట్యాన్ని కళ్ల ముందుంచే శరీరం.. కత్రినా కైఫ్ సొంతం. ‘బూమ్’ సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది కత్రినా కైఫ్. తొలి చిత్రంలోనే అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే ఆఫర్ కొట్టేసిన ఈ భామ మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ‘అల్లరి పిడుగు’ చిత్రం తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. నటిగా అలరిస్తూనే అడపాదడపా స్పెషల్ సాంగ్స్‌లో చిందులేసి అదరగొడుతోంది.
సుమారు 40కి పైగా సినిమాల్లో ఆడిపాడిన కత్రినా.. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఈమె ఒక్క సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటుందట. వాణిజ్య ప్రకటనలు, తన మేకప్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ ద్వారా వచ్చే ఆదాయం దీనికి అదనం. ముంబైలో సుమారు రూ.8 కోట్ల విలాసవంతమైన బంగ్లా ఉందని టాక్ . ఇక లండన్‌లోనూ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా ఉన్నట్లు తెలుస్తోంది.
కోట్లు విలువ చేసే భూమి కూడా తన పేరు మీద ఉందట. ఇక కార్ల మీద మోజు పడే కత్రినా గ్యారేజీలో ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, వోగ్, ఎల్‌డబ్ల్యూబీతో పాటు మెర్సిడిస్ ఎమ్‌ఎల్ 350, ఆడీ క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా కత్రినా కైఫ్‌కు రూ.150 కోట్ల పైచిలుకు ఆస్తి ఉండొచ్చని సమాచారం. విక్కీ కౌశల్‌తో కత్రినా ప్రేమలో ఉందని తెలుస్తోంది. ఆగస్టులో విక్కీ, కత్రినాకు పెళ్లి కుదిరిందని, వారి రోకా ఫంక్షన్ కూడా జరిగినట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…