Katrina Kaif : బాగానే సంపాదించిందిగా.. క‌త్రినాకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా..!

October 20, 2021 6:24 PM

Katrina Kaif : చూపు తిప్పుకోని అందం, నెమలి నాట్యాన్ని కళ్ల ముందుంచే శ‌రీరం.. క‌త్రినా కైఫ్ సొంతం. ‘బూమ్‌’ సినిమాతో నటిగా కెరీర్‌ ఆరంభించింది కత్రినా కైఫ్‌. తొలి చిత్రంలోనే అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించే ఆఫర్‌ కొట్టేసిన ఈ భామ మ‌ల్లీశ్వ‌రి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ‘అల్లరి పిడుగు’ చిత్రం తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. న‌టిగా అల‌రిస్తూనే అడ‌పాద‌డ‌పా స్పెష‌ల్ సాంగ్స్‌లో చిందులేసి అద‌ర‌గొడుతోంది.

Katrina Kaif earned more got assets you do not imagine

సుమారు 40కి పైగా సినిమాల్లో ఆడిపాడిన కత్రినా.. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఈమె ఒక్క సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటుందట. వాణిజ్య ప్రకటనలు, తన మేకప్‌ బ్రాండ్‌ ‘కే బ్యూటీ’ ద్వారా వచ్చే ఆదాయం దీనికి అదనం. ముంబైలో సుమారు రూ.8 కోట్ల విలాస‌వంత‌మైన బంగ్లా ఉంద‌ని టాక్ . ఇక లండన్‌లోనూ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా ఉన్నట్లు తెలుస్తోంది.

కోట్లు విలువ చేసే భూమి కూడా తన పేరు మీద ఉందట. ఇక కార్ల మీద మోజు పడే కత్రినా గ్యారేజీలో ల్యాండ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌, వోగ్‌, ఎల్‌డబ్ల్యూబీతో పాటు మెర్సిడిస్‌ ఎమ్‌ఎల్‌ 350, ఆడీ క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా కత్రినా కైఫ్‌కు రూ.150 కోట్ల పైచిలుకు ఆస్తి ఉండొచ్చని సమాచారం. విక్కీ కౌశ‌ల్‌తో క‌త్రినా ప్రేమ‌లో ఉంద‌ని తెలుస్తోంది. ఆగ‌స్టులో విక్కీ, క‌త్రినాకు పెళ్లి కుదిరింద‌ని, వారి రోకా ఫంక్ష‌న్ కూడా జ‌రిగిన‌ట్లు నెట్టింట వార్త‌లు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now