Katrina Kaif : క‌త్రినా – విక్కీ కౌశ‌ల్ మ్యారేజ్‌కి వెళ్లేవారు.. ఈ కండిష‌న్స్ ను త‌ప్పనిసరిగా పాటించాలి..!

November 26, 2021 2:59 PM

Katrina Kaif : బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్ కొన్నాళ్లుగా సీక్రెట్ ల‌వ్ వ్య‌వ‌హారం న‌డిపిస్తూ వ‌స్తున్నారు. క‌లిసి పార్టీల‌కు వెళ్ల‌డం, అప్పుడ‌ప్పుడూ క‌లుసుకోవ‌డం ఆ స‌మ‌యంలో కెమెరాల‌కు చిక్క‌డం వంటివి జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు ఈ జంట పెళ్లి చేసుకునేందుకు సిద్ధమ‌య్యారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వ‌ర‌కు జరగనున్న వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ వేదిక కానుందట.

Katrina Kaif and vicky kaushal marriage they put conditions

తమ జీవితాల్లో ఎంతో కీలకమైన ఈ రోజుని కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని వీరిద్దరూ భావించారట. అందుక‌ని తమ పెళ్లి వేడుకకు వచ్చే వారికి కత్రినా కైఫ్‌ – విక్కీ కౌశల్‌ జోడీ ఓ రిక్వెస్ట్ పెట్టిందని తెలుస్తోంది. పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్‌ కావడం తమకు ఇష్టం లేదని.. అందుచేత ఈ పెళ్లికి ఎవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని కత్రినా, విక్కీ కోరినట్లు తెలుస్తోంది.

ఫంక్షన్‌ని ఏర్పాటు చేస్తోన్న ఆర్గనైజర్స్‌కి సైతం ఈ విషయంపై రూల్‌ పాస్‌ చేశారట. మరోవైపు శుభకార్యం దగ్గరపడుతోన్న తరుణంలో ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ జంట గత కొన్నిరోజుల నుంచి పెళ్లి పనుల్లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారట. ఇంతకు ముందు రణ్‌​వీర్​ సింగ్, దీపికా జంట కూడా ఇలాగే పెళ్లి ఫొటోలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కత్రినా, విక్కీల వివాహ వేడుక‌కు ఇండ‌స్ట్రీ నుండి ఎవ‌రెవ‌రు హాజ‌రవుతారు.. అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now