Katrina Kaif : పెళ్ల‌యి కొన్ని రోజులే అవుతోంది.. అప్పుడే క‌త్రినా 6 నెల‌ల గ‌ర్భ‌వ‌తా ?

May 13, 2022 7:50 PM

Katrina Kaif : సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక అందులో వ‌స్తున్న వార్త‌ల్లో అస‌లు ఏది నిజం.. ఏది అబద్ధం.. అన్నది తెలియ‌కుండా పోతోంది. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది కావాల‌ని ప‌నిగట్టుకుని మ‌రీ త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. కేవ‌లం వ్యూస్ కోస‌మే వారు ఇలా చేస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇక ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ గురించి అయితే ఓ భారీ రూమ‌ర్‌నే సృష్టించారు. క‌త్రినా కైఫ్ గ‌ర్భంతో ఉంద‌ని.. ఆమెకు ఇప్పుడు 6వ నెల అని.. అందుక‌నే అంత హ‌డావిడిగా పెళ్లి చేసుకుంద‌ని.. ఇకపై సినిమాల్లో న‌టించ‌ద‌ని.. ఇలా ఈమె గురించి ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల పుకార్ల‌ను వ్యాప్తి చేస్తున్నారు. అయితే ఈ విష‌యాల‌పై క‌త్రినా కైఫ్ టీమ్ స్పందించింది.

క‌త్రినా అస‌లు గ‌ర్భం ధ‌రించ‌లేద‌ని.. ఆమె ప్రెగ్నెంట్ కాద‌ని.. ఆమె టీమ్ రిప్లై ఇచ్చింది. ఓ న్యూస్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌త్రినా టీమ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఆమె ప్ర‌స్తుతం సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టింద‌ని.. క‌నుక ఆమె గ‌ర్భంతో ఉంద‌ని.. 6వ నెల ప్రెగ్నెంట్ అని.. సినిమాల‌కు దూరం అవుతుంద‌ని.. వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు.

fact check is Katrina Kaif pregnant or not
Katrina Kaif

కాగా బాలీవుడ్ న‌టులు విక్కీ కౌశ‌ల్‌, క‌త్రినా కైఫ్‌లు గ‌తేడాది డిసెంబ‌ర్ 9వ తేదీన పెళ్లి చేసుకున్నారు. రాజ‌స్థాన్‌లోని బ‌ర్వారాలో ఉన్న ది సిక్స్ సెన్సెస్ అనే కోట‌లో వీరి వివాహం జ‌రిగింది. కొద్ది మంది స్నేహితులు, తెలిసిన వారు, బాలీవుడ్ న‌టుల‌తోపాటు కుటుంబ స‌భ్యుల న‌డుమ వీరి వివాహం జ‌రిగింది. ఇక ప్ర‌స్తుతం వీరు న్యూయార్క్‌లో విహ‌రిస్తున్నారు. అక్క‌డ స్విమ్మింగ్ పూల్‌లో వీరిద్ద‌రూ క‌ల‌సి ఉన్న ఫొటోను రీసెంట్‌గా షేర్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆ ఫొటో వైర‌ల్‌గా మారింది.

ఇక విక్కీ కౌశ‌ల్ ప్ర‌స్తుతం ల‌క్ష్మ‌ణ్ ఉటెక‌ర్ మూవీలో న‌టిస్తుండ‌గా.. శశాంక్ ఖైతాన్‌కు చెందిన గోవిందా నామ్ మేరా అనే ఇంకో మూవీలోనూ న‌టిస్తున్నాడు. అలాగే మేఘ‌నా గుల్జార్ తెర‌కెక్కిస్తున్న శామ్ మ‌నెక్షా అనే బ‌యోపిక్ మూవీలోనూ న‌టిస్తున్నాడు. ఇక క‌త్రినా విష‌యానికి వ‌స్తే ఈమె ఫోన్ బూత్‌, మెర్రీ క్రిస్మ‌స్‌, టైగ‌ర్ 3 అనే మూవీల‌తో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now