T20 World Cup 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా యూఏఈలో జరగుతున్న వార్మప్ మ్యాచ్‌లలో భారత్ సత్తా చాటింది. మొదట ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించగా.. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఇంకో వార్మప్ మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో స్టీవెన్ స్మిత్, మార్క్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లు రాణించారు. 48 బంతులు ఆడిన స్మిత్ 7 ఫోర్లతో 57 పరుగులు చేయగా, 25 బంతులు ఆడిన స్టాయినిస్ 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ 28 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్ తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదించింది. 17.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్యా 8 బంతుల్లో 1 సిక్సర్‌తో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో అగర్ 1 వికెట్ తీశాడు.
కాగా వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 24వ తేదీన పాకిస్థాన్‌తో ఆడనుంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…