Jabardasth : బుల్లితెరపై అత్యంత సక్సెస్ సాధించిన షోలలో జబర్దస్త్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు స్టార్ కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు అందరూ ఈ షోకు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇతర ఛానళ్లలో డబుల్ రెమ్యునరేషన్ ఇస్తుండడంతోనే వారు ఇలా జబర్దస్త్‌కు గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్‌కు అయితే ఏకంగా రూ.15 లక్షలను స్టార్ మా ఇస్తుందని సమాచారం. కనుకనే చాలా మంది ఆ ఛానల్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా అనసూయ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. తాను తన కెరీర్‌లో కీలకమైన నిర్ణయం తీసుకున్నానని.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా చేయక తప్పడం లేదని.. తనకు ఇప్పటి వరకు ప్రేక్షకులు ఎంతో మద్దతు ఇచ్చారని.. ఇకపై కూడా ఆ సపోర్ట్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నానని అనసూయ తెలియజేసింది. దీంతో ఆమె కూడా జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు సినిమాల్లో ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని కనుకనే స్నేహితుల సలహా మేరకు నెమ్మదిగా టీవీ షోలను మానేస్తుందని సమాచారం.
ఇక అనసూయ స్థానంలో జబర్దస్త్‌లో మరో కొత్త యాంకర్‌ను తీసుకు రావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అయితే అందుకు ఎవరు సరిగ్గా సూట్ అవుతారు.. అన్నదే ప్రశ్న. ఈ క్రమంలోనే యాంకర్ మంజూష పేరు ఈ విషయంలో స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె ఈ మధ్య కాలంలో గ్లామర్ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. అందువల్ల ఆమెకు నిర్వాహకులు చాన్స్ ఇస్తారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మంజూషనే జబర్దస్త్ షోలో తదుపరి యాంకర్‌గా రానుందని తెలుస్తోంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. వీటిల్లో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…