Actress Meena : ప్రముఖ సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో మృతి చెందిన విషయం విదితమే. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి. దీంతో లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. అయితే దాతలు ఎవరూ లభించలేదు. దీంతో విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో మీనా కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్తను చూసి ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన అంత్యక్రియలను దగ్గరుండి ఆమే నిర్వహించారు. కడసారి చూపులకు పలువురు టాలీవుడ్ హీరోలు హాజరయ్యారు. అయితే భర్త చనిపోయిన అనంతరం మీనా గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. దీంతో మీనా స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
నా భర్తను నేను ఎంతగానో ప్రేమించాను. అలాంటి ఆయన నాకు దూరమయ్యారు. ఆ బాధలో నేను ఉన్నాను. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నా. మాకు సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేయకండి. ప్రచురించకండి. కష్టసమయంలో నా వెంట నిలబడ్డ వారందరికీ కృతజ్ఞతలు. నా భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన మెడికల్ టీమ్, సీఎం స్టాలిన్, తమిళనాడు హెల్త్ మినిస్టర్ రాధాకృష్ణన్, సన్నిహితులు, స్నేహితులు, ఫ్యామిలీ, మీడియా, ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు.. అని మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
తన గురించి ప్రార్థించిన అందరికీ పేరు పేరునా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన వెంట ఉన్న అందరికీ థాంక్స్ అని చెప్పి ముగించారు. ఈ క్రమంలోనే మీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెసేజ్ వైరల్ అవుతోంది. ఇక మీనా గురించి అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. భర్త చనిపోవడంతో కుమార్తె ఆలనా పాలనా చూసుకోవడం కోసం ఆమె సినిమాలకు ఇక గుడ్‌బై చెబుతుందని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…