Actress Meena : భ‌ర్త చ‌నిపోయాక మీనా మొద‌టి మెసేజ్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

July 2, 2022 7:59 AM

Actress Meena : ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో మృతి చెందిన విష‌యం విదిత‌మే. క‌రోనా కార‌ణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి. దీంతో లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వ‌చ్చింది. అయితే దాత‌లు ఎవ‌రూ ల‌భించ‌లేదు. దీంతో విద్యాసాగ‌ర్ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్ర‌మంలో మీనా కుటుంబంలో తీవ్ర విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. భ‌ర్త‌ను చూసి ఆమె క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను ద‌గ్గ‌రుండి ఆమే నిర్వ‌హించారు. క‌డ‌సారి చూపుల‌కు ప‌లువురు టాలీవుడ్ హీరోలు హాజ‌ర‌య్యారు. అయితే భ‌ర్త చ‌నిపోయిన అనంత‌రం మీనా గురించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో మీనా స్పందించారు. ఇంత‌కీ ఆమె ఏమ‌న్నారంటే..

నా భ‌ర్త‌ను నేను ఎంత‌గానో ప్రేమించాను. అలాంటి ఆయ‌న నాకు దూర‌మ‌య్యారు. ఆ బాధ‌లో నేను ఉన్నాను. ఈ స‌మ‌యంలో మా ప్రైవ‌సీని గౌర‌వించాల‌ని కోరుకుంటున్నా. మాకు సంబంధించి త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌కండి. ప్ర‌చురించ‌కండి. క‌ష్ట‌స‌మ‌యంలో నా వెంట నిల‌బ‌డ్డ వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. నా భ‌ర్త‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నించిన మెడిక‌ల్ టీమ్‌, సీఎం స్టాలిన్‌, త‌మిళ‌నాడు హెల్త్ మినిస్ట‌ర్ రాధాకృష్ణ‌న్‌, స‌న్నిహితులు, స్నేహితులు, ఫ్యామిలీ, మీడియా, ఫ్యాన్స్‌కి ధ‌న్య‌వాదాలు.. అని మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

Actress Meena first message after her husband death
Actress Meena

త‌న గురించి ప్రార్థించిన అంద‌రికీ పేరు పేరునా ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. త‌న వెంట ఉన్న అంద‌రికీ థాంక్స్ అని చెప్పి ముగించారు. ఈ క్ర‌మంలోనే మీనా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన మెసేజ్ వైర‌ల్ అవుతోంది. ఇక మీనా గురించి అనేక ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. భ‌ర్త చ‌నిపోవ‌డంతో కుమార్తె ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం కోసం ఆమె సినిమాల‌కు ఇక గుడ్‌బై చెబుతుంద‌ని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment