Jabardasth : జ‌బ‌ర్దస్త్‌లో అనసూయ‌కు బ‌దులుగా రాబోతున్న‌ది.. ఈమెనే..?

July 1, 2022 10:43 PM

Jabardasth : బుల్లితెరపై అత్యంత స‌క్సెస్ సాధించిన షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇదంతా ఒకప్ప‌టి మాట‌. ఇప్పుడు స్టార్ క‌మెడియ‌న్లు, యాంక‌ర్లు, జ‌డ్జిలు అంద‌రూ ఈ షోకు ఒక్కొక్క‌రుగా దూర‌మ‌వుతున్నారు. ఇత‌ర ఛాన‌ళ్ల‌లో డ‌బుల్ రెమ్యున‌రేష‌న్ ఇస్తుండ‌డంతోనే వారు ఇలా జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్‌కు అయితే ఏకంగా రూ.15 ల‌క్ష‌ల‌ను స్టార్ మా ఇస్తుంద‌ని స‌మాచారం. క‌నుకనే చాలా మంది ఆ ఛాన‌ల్ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా అన‌సూయ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది. తాను త‌న కెరీర్‌లో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని.. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఇలా చేయ‌క తప్ప‌డం లేద‌ని.. త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఎంతో మ‌ద్ద‌తు ఇచ్చార‌ని.. ఇక‌పై కూడా ఆ సపోర్ట్‌ను కొన‌సాగిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని అన‌సూయ తెలియ‌జేసింది. దీంతో ఆమె కూడా జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమెకు సినిమాల్లో ఆఫ‌ర్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని క‌నుక‌నే స్నేహితుల స‌ల‌హా మేర‌కు నెమ్మ‌దిగా టీవీ షోల‌ను మానేస్తుంద‌ని స‌మాచారం.

Jabardasth Anchor Manjusha may come in place of Anasuya
Jabardasth

ఇక అన‌సూయ స్థానంలో జ‌బ‌ర్ద‌స్త్‌లో మ‌రో కొత్త యాంక‌ర్‌ను తీసుకు రావాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే అందుకు ఎవ‌రు స‌రిగ్గా సూట్ అవుతారు.. అన్న‌దే ప్ర‌శ్న‌. ఈ క్ర‌మంలోనే యాంక‌ర్ మంజూష పేరు ఈ విష‌యంలో స్ప‌ష్టంగా వినిపిస్తోంది. ఆమె ఈ మ‌ధ్య కాలంలో గ్లామ‌ర్ ఫొటోల‌ను కూడా షేర్ చేస్తోంది. అందువ‌ల్ల ఆమెకు నిర్వాహ‌కులు చాన్స్ ఇస్తార‌ని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే మంజూషనే జ‌బ‌ర్ద‌స్త్ షోలో త‌దుప‌రి యాంక‌ర్‌గా రానుంద‌ని తెలుస్తోంది. అయితే ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లే. వీటిల్లో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now