అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఓ మహిళ లాటరీ తగల్లేదని ఎంత పరధ్యానంలో ఉండి ఆ లాటరీ టికెట్ ను దుకాణంలో ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోయింది. అయితే పది రోజుల తర్వాత ఆ టికెట్ సదరు దుకాణదారుడు తీసి చూడగా ఏకంగా ఆ మహిళ మిలియన్ డాలర్లు (రూ.7.27 కోట్లు) గెలుచుకున్న ఘటన మాసాచుసెట్స్ రాష్ట్రంలోని సౌత్‌విక్ పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మాసాచుసెట్స్ రాష్ట్రంలోని సౌత్‌విక్ పట్టణంలో భారతీయ కుటుంబం ‘లక్కీ స్టాప్’ పేరిట దుకాణం నిర్వహిస్తోంది. ఈ దుకాణానికి తరచూ వచ్చే లీ రోజ్ ఫిగా అనే స్థానిక మహిళ గత మార్చిలో వారి వద్ద డైమండ్ మిలియన్స్ స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్ కొంది. ఈ క్రమంలోనే తన లాటరీ ఫలితాలు చూసుకోవడానికి దుకాణానికి వచ్చిన లీ రోజ్ పరధ్యానంలో టికెట్ గీకి చూసింది.మధ్యాహ్న భోజన సమయంలో దుకాణానికి వెళ్లిన మహిళ తక్కువ సమయం ఉండటంతో టికెట్ పై సరిగా స్క్రాచ్ చేయకుండా,తనకు లాటరీ తగల్లేదన్న బాధతో లాటరీ టికెట్ ఆ దుకాణంలోని చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోయింది.
పది రోజుల పాటు చెత్తకుండీలో ఉన్న ఆ టికెట్ ను దుకాణం యజమాని కొడుకు అభి షా కంటపడింది. ఆ టికెట్ సరిగ్గా స్క్రాచ్ చేయకుండా ఉండడంతో అభి లాటరీ టికెట్ స్క్రాచ్ చేసే చూడటంతో ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.మిలియన్ అమెరికన్ డాలర్లను గెలుచుకున్న లాటరి టికెట్ వారికి దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రెండు రోజులపాటు ఆనందంలో తేలిపోయిన అభి కుటుంబం ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న తమ తాతలతో పంచుకోగా వారు ఆ డబ్బు మనకు అక్కర్లేదు..ఆ టికెట్ ఎవరు కొన్నారో వారికి ఇచ్చేయండి అని మందలించడంతో మౌనిశ్ షా కుటుంబం ఆ టికెట్ ను లీ రోజ్ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
తను లాటరీ డబ్బులు గెలిచిన విషయాన్ని మౌనిశ్ షా కుటుంబం రోజ్ కి తెలుపగా ఆమె పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా వారిని కౌగిలించుకుని ఏడ్చేసింది.విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ మీడియా సంస్థలు మౌనిషా కుటుంబానికి ఫోన్ కాల్ చేసి అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…