iPhone 13 : ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్‌.. రూ.12,400 త‌గ్గింపు.. త్వ‌ర‌ప‌డండి..!

July 21, 2022 4:37 PM

iPhone 13 : యాపిల్ సంస్థ త‌న ఐఫోన్ 13 మోడ‌ల్‌పై భారీ తగ్గింపు ధ‌ర‌ను అందిస్తోంది. ఈ ఆఫ‌ర్ యాపిల్ ప్రీమియం రీసెల్ల‌ర్ స్టోర్స్‌తోపాటు ప‌లు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్ వ‌ల్ల ఐఫోన్ 13 కు చెందిన 128 జీబీ స్టోరేజ్ బేస్ మోడ‌ల్‌ను రూ.8,400 త‌గ్గింపు ధ‌ర‌కు అందిస్తారు. అదే క‌స్ట‌మ‌ర్ హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొంటే ఇంకో రూ.4వేల డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో మొత్తం రూ.12,400 డిస్కౌంట్ ల‌భిస్తుంది. కాగా ఐఫోన్ 13కి చెందిన 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.79,999గా ఉంది. ఆఫ‌ర్ వ‌ల్ల రూ.67,599 ధ‌ర‌కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇక క‌స్ట‌మ‌ర్లు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ స‌దుపాయాన్ని ఎంచుకుంటే మ‌రింత డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే గ‌రిష్టంగా ఈ ఫోన్‌పై రూ.19వేల వ‌ర‌కు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో ఫోన్ రూ.48,500 ధ‌ర‌కు ల‌భిస్తుంది. అయితే ఇందుకు గాను క‌స్ట‌మ‌ర్లు త‌మ ఐఫోన్ 12 ప్రొ లేదా ప్రొ మ్యాక్స్ ఫోన్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ ఆఫ‌ర్ ద్వారా చాలా త‌క్కువ ధ‌ర‌కు ఐఫోన్ 13 ఫోన్‌ను పొంద‌వ‌చ్చు.

huge discount on iPhone 13 hurry up
iPhone 13

ఇక ఈ ఆఫ‌ర్‌కు గ‌డువు ఎప్పుడు ముగుస్తుందో చెప్ప‌లేదు. కానీ ప‌రిమిత కాలం వ‌ర‌కు మాత్ర‌మే ఆఫ‌ర్ అందుబాటులో ఉండ‌నుంది. ఇందులో భాగంగా క‌స్ట‌మ‌ర్లు ఐఫోన్ 13కి చెందిన బ్లూ, గ్రీన్‌, రెడ్‌, వైట్‌, మిడ్‌నైట్‌, పింక్ క‌ల‌ర్ వేరియెంట్ల‌లో దేన్న‌యినా కొన‌వ‌చ్చు. దేన్ని కొన్నా ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. అయితే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లోఈ ఆఫ‌ర్ అందుబాటులో లేదు. యాపిల్ రీసెల్ల‌ర్స్ లేదా ఇత‌ర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనే ఐఫోన్‌ను ఇలా కొనాల్సి ఉంటుంది. కాగా అమెజాన్‌లో ఇదే ఫోన్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.69,990 ఉండ‌గా.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74,209 ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment