శుక్రవారం, జూన్ 26, 2026
వార్తలు

Ghani Movie : ఓటీటీలో చాలా త్వ‌ర‌గానే వ‌స్తున్న గ‌ని.. ఎందులో.. ఎప్పుడు.. అంటే..?

Ghani Movie : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం.. గ‌ని. ఈ మూవీ ఈ నెల 8వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ఈ…

Ghani Movie : ఓటీటీలో చాలా త్వ‌ర‌గానే వ‌స్తున్న గ‌ని.. ఎందులో.. ఎప్పుడు.. అంటే..?

Ghani Movie : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం.. గ‌ని. ఈ మూవీ ఈ నెల 8వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ సినిమాకు ర‌చ‌యిత కూడా ఆయ‌నే కావ‌డం విశేషం. ఇక ఈ మూవీలో వ‌రుణ్ తేజ్‌కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ న‌టించింది.

Ghani Movie releasing on OTT very soon know which one
Ghani Movie

అయితే గ‌ని డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఓటీటీ యాప్ ఆహా సొంతం చేసుకుంది. క‌నుక ఆహాలో గ‌ని మూవీ స్ట్రీమ్ కానుంది. దీన్ని ఏప్రిల్ 29వ తేదీన ఆహాలో విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ఇదే గ‌నక జ‌రిగితే చాలా త‌క్కువ వ్య‌వ‌ధిలో సినిమా ఓటీటీలోకి వ‌చ్చిన‌ట్లు అవుతుంది.

ఇక గ‌నికి సంబంధించి ఇటీవ‌లే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్‌తోపాటు ఆయ‌న తండ్రి అల్లు అర‌వింద్ కూడా ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఇక ఈ మూవీలో ఉపేంద్ర‌, జ‌గ‌ప‌తి బాబు, న‌దియా, సునీల్‌శెట్టి, న‌వీన్ చంద్ర‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద‌లు ఈ మూవీని నిర్మించారు. థ‌మ‌న్ సంగీతం అందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి