గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Faria Abdullah : జాతి ర‌త్నాలు బ్యూటీ.. ఏంటి.. ఇలా డ్యాన్స్ చేసింది.. వీడియో వైర‌ల్‌..!

Faria Abdullah : ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై భారీ స‌క్సెస్‌ను అందుకున్న చిత్రంగా.. జాతిర‌త్నం మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. ఇందులో చిట్టిగా న‌టించిన ఫ‌రియా అబ్దుల్లా యువ‌తను ఎంతో ఆక‌ట్టుకుంది. ఈమె ఈ చిత్రంతో అనేక…

Faria Abdullah : జాతి ర‌త్నాలు బ్యూటీ.. ఏంటి.. ఇలా డ్యాన్స్ చేసింది.. వీడియో వైర‌ల్‌..!

Faria Abdullah : ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై భారీ స‌క్సెస్‌ను అందుకున్న చిత్రంగా.. జాతిర‌త్నం మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. ఇందులో చిట్టిగా న‌టించిన ఫ‌రియా అబ్దుల్లా యువ‌తను ఎంతో ఆక‌ట్టుకుంది. ఈమె ఈ చిత్రంతో అనేక ఆఫ‌ర్ల‌ను పొందుతుంద‌ని అనుకున్నారు. కానీ ఆమె ఆశించిన‌ట్లు ఆఫ‌ర్లు మాత్రం ఏమీ రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీలో చిన్న అతిథి పాత్ర‌లో ఈమె న‌టించింది. త‌రువాత నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల‌తో క‌లిసి బంగార్రాజు మూవీలో డ్యాన్స్ చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈమె ప‌లు సినిమాల్లోనూ న‌టిస్తోంది.

ఫరియా అబ్దుల్లా ప్ర‌స్తుతం రావ‌ణాసుర అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇక తాజాగా ఈమెకు చెందిన వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన వారంద‌రూ.. వామ్మో.. ఏంటి.. ఈమె ఎలా డ్యాన్స్ చేసింది.. ఈమె ఇలా కూడా చేస్తుందా.. అని షాక‌వుతున్నారు. అందులో ఈమె బెల్లీ డ్యాన్స్ చేయ‌డం విశేషం. ఆమె డ్యాన్స్ చూసి నెటిజ‌న్ల‌కు మ‌తులు పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయి కామెంట్లు పెడుతున్నారు. కొంద‌రు బాగా చేశావ‌ని కామెంట్స్ పెడుతుంటే.. కొంద‌రు గుండెల్లో మంట పెట్టేశావు.. అని అంటున్నారు.

Faria Abdullah latest dance video viral
Faria Abdullah

ఇక ఫ‌రియా అబ్దుల్లా చేసిన ఈ డ్యాన్స్‌కు యువ‌త మైమ‌రిచిపోతున్నారు. గ‌తంలో ఈమె ఎప్పుడూ ఇలా క‌నిపించ‌లేదు. దీంతో ఈమె ఇలా డ్యాన్స్ చేసే స‌రికి ఈమె ఈ డ్యాన్స్ కూడా చేయ‌గ‌ల‌దా.. అని షాక‌వుతున్నారు. అయితే ఈ విధంగా డ్యాన్స్ చేయ‌డం ద్వారా తాను ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మెసేజ్ పంపింద‌ని అంటున్నారు. ఇలాగైనా చాన్స్‌లు ఇస్తారేమోన‌ని ఆమె ఆశ ప‌డింద‌ని అంటున్నారు. మ‌రి ఆమెకు ఫ్యూచ‌ర్‌లో అవ‌కాశాలు ఎలా ఉంటాయో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి