గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Aloe Vera Juice : క‌ల‌బంద ర‌సాన్ని రోజూ తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

Aloe Vera Juice : మనలో చాలా మంది ఇళ్లలో అలోవెరా మొక్కను ఎక్కువగా పెంచుతారు. ఈ మొక్కనే  మన వాడుక భాషలో కలబంద అని పిలుస్తాము. ఎక్కువ నీరు పొయ్యకపోయినా బతికే ఎడారి మొక్క ఇది. కానీ…

Aloe Vera Juice : క‌ల‌బంద ర‌సాన్ని రోజూ తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

Aloe Vera Juice : మనలో చాలా మంది ఇళ్లలో అలోవెరా మొక్కను ఎక్కువగా పెంచుతారు. ఈ మొక్కనే  మన వాడుక భాషలో కలబంద అని పిలుస్తాము. ఎక్కువ నీరు పొయ్యకపోయినా బతికే ఎడారి మొక్క ఇది. కానీ దానిలో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలోవెరా మొక్క కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కలబందలో ఉండే గుజ్జు 96 శాతం నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా అలోవెరాను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు.

కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా కలబంద మొక్కలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో జింక్, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఈ పోషకాలన్నీ మీ శరీరానికి అందించి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది. చర్మంపై అలర్జీలను దూరం చేస్తుంది. కలబంద రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కీళ్ల నొప్పులు వంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద రసం ప్రేగులలో నీటి శాతాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది. తద్వారా మలబద్ధక సమస్య నివారిస్తుంది.

drink Aloe Vera Juice daily for these amazing benefits
Aloe Vera Juice

కలబంద రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని దరిచేరనివ్వదు. కలబంద పూర్తిగా సహజమైనది కాబట్టి ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే కలబంద తినడం అనేది అందరికీ పని చేయకపోవచ్చు. మీరు కలబందను జ్యూస్ రూపంలో గాని లేక తినే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి