గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Gold : బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?

Gold : ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. ఏ శుభకార్యమైనా బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకు ఆ బంగారాన్ని…

Gold : బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?

Gold : ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. ఏ శుభకార్యమైనా బంగారాన్ని ప్రతి ఒక్కరూ కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకు ఆ బంగారాన్ని ప్యాక్ చేసి ఒక పింక్ కలర్ ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పింక్ కవర్ ఎందుకు వాడతారో తెలుసుకుందాం.

సాధారణంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్ అనేది మెయిన్ ప్రొడక్ట్ ను హైలెట్ గా చేసే విధంగా ఉండాలని అనుకుంటారు. ఉదాహరణకు సర్జరీ చేసేటప్పుడు వైద్యులు ఆపరేషన్ గదిలో ఆకుపచ్చని బ్యాక్ గ్రౌండ్ ఉండేలా చూసుకుంటారు. ఇదే సూత్రం బంగారానికి కూడా వర్తిస్తుంది. బంగారం మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుపు సరైన విధంగా కనిపించాలంటే వెనకాల ఉండే బ్యాక్ గ్రౌండ్ మంచిగా అట్రాక్షన్ గా ఉండాలి. అందుకోసమే వెండి లేదా బంగారం వస్తువులను అమ్మేవారు పింక్ పేపర్ ను ఉపయోగిస్తూ ఉంటారు.

do you know why merchants give gold ornaments in pink color paper
Gold

నలుపును చాలామంది అశుభ సూచకంగా ఉపయోగిస్తారు. ఇక ఆ రంగు కాకుండా పింక్ రంగు పేపర్ అయితే బంగారం మెరుపును అందంగా కనిపించేలా చేస్తుంది. అందుకే పింక్ కలర్ పేపర్ ను ఉపయోగిస్తారు. అయితే ప్ర‌స్తుతం చాలా మంది జ్యువెల్ల‌రీ షాపుల్లో కొంటున్నారు. వీటిల్లో ఆభ‌ర‌ణానికి త‌గిన బాక్స్ లో దాన్ని పెట్టి ఇస్తారు. అందులో ఏ రంగు అయినా ఉండ‌వ‌చ్చు. క‌నుక పింక్ రంగు పేప‌ర్ అనేది పురాత‌న కాలంలో ఉప‌యోగించార‌ని చెప్పవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి