Chiranjeevi : చిరంజీవి, పవన్ కళ్యాణ్ యాడ్స్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

November 22, 2022 11:46 AM

Chiranjeevi : ఒకప్పుడు యాడ్స్ అంటే కేవలం మోడల్స్ మాత్రమే ఎక్కువ చేసేవారు. కానీ ఈ తర్వాత కాలంలో జనాలలో సినిమా నటులకు కూడా మంచి గుర్తింపు రావడం మొదలయింది. ఏ స్టార్స్ అయితే ప్రజలలో ఎక్కువగా ఆదరణ ఉంటుందో ఆ స్టార్స్ తో యాడ్స్ తీయడం మొదలయ్యింది. ఇప్పుడు ఏకంగా కోట్లు ఇచ్చి వాల బ్రాండ్లు ప్రోమోట్ చేస్కోడంకి.. స్టార్స్ ని బ్రాండ్ అంబాసిడర్స్ గా  పెట్టుకుంటున్నారు. స్టార్స్ సైతం సినిమాల్లో కన్నా కూడా  యాడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం రావడంతో ప్రకటనలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

అయితే గతంలో థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సికి బ్రాండ్ అంబాసిడర్ ఉండేవారు. అంతేకాదు నవరత్న ఆయిల్ కి కూడా చిరంజీవి అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత కాలంలో థమ్స్ అప్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అయితే చిరు థమ్స్ అప్ యాడ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసినపుడు ఒక వివాదం తలెత్తింది. కానీ మహేష్ ఈ యాడ్ చేసే టైంలో ఎలాంటి వివాదం రాలేదు.

do you know why Chiranjeevi and pawan kalyan not act in ads
Chiranjeevi

ఓ బాధ్యతాయుతమైనా స్థానంలో ఉంటూ, చిన్నపిల్లలకు ,పెద్దలకు చెడు చేసే ఇలాంటి హానికరమైన శీతల పానీయాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ఏమిటని చాలామంది చిరంజీవిని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ విమర్శలకు ఫలితంగా చిరంజీవి,పవన్ కళ్యాణ్ లు నాటినుంచి నేటివరకూ కూడా ఎలాంటి వాణిజ్య ప్రకటనలలో పాలుపంచుకోవడం లేదు. కేవలం ఈ ఒక్క కారణం వల్లే పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వాణిజ్య  ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్, హీరోయిన్స్  రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, సమంత వంటి వారు సినిమాలతో పాటు అనేక వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now