గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ?

సాధారణంగా మనం ఎదుగుతున్న క్రమంలో చాలా మంది మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేరు. ఈ క్రమంలోనే ఎదుగుతున్న కుటుంబంపై వారి చెడు ప్రభావాలు, చెడు దృష్టి పడటం వల్ల ఆ కుటుంబం ఎన్నో ఆర్థిక సమస్యలను, కష్టనష్టాలను ఎదుర్కోవలసి…

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ?

సాధారణంగా మనం ఎదుగుతున్న క్రమంలో చాలా మంది మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేరు. ఈ క్రమంలోనే ఎదుగుతున్న కుటుంబంపై వారి చెడు ప్రభావాలు, చెడు దృష్టి పడటం వల్ల ఆ కుటుంబం ఎన్నో ఆర్థిక సమస్యలను, కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా నరదృష్టి తగలకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎవరి చెడు ప్రభావం పడదు.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా ?

మనం ఆర్థికంగా ఎదుగుతున్న క్రమంలో మన గొప్పలను ఇతరుల దగ్గర పదేపదే చెప్పకూడదు. మనకు సంపద కలసి వస్తున్నప్పటికీ బయటకి ఆ విషయాలు చెప్పనప్పుడే ఇతరుల చెడు ప్రభావం మనపై పడదు. అదేవిధంగా ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఉండాలంటే.. మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద కనుదిష్టి వినాయకుడి ఫోటోను ఉంచాలి. అలాగే ప్రతి అమావాస్య రోజు మన ఇంటికి దిష్టి తీసి ఐదు పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయను దారానికి కట్టి వినాయకుడి ఫోటో కింద తగిలించడం వల్ల ఏ విధమైనటువంటి చెడు దృష్టి మన ఇంటిపై పడదు.

అలాగే చెడు ప్రభావం, నర దృష్టి మనపై పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇంటి ప్రధాన ద్వారం ఎదుట ఒక బూడిద గుమ్మడికాయను తగిలించాలి. బూడిద గుమ్మడికాయకు మన ఇంటిపై ఏర్పడే చెడు ప్రభావాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. ఇలా గుమ్మడికాయ కట్టి అది కుళ్ళిపోయిన తరువాత దాని స్థానంలో మరొక గుమ్మడికాయను కట్టాలి. దీంతో మన ఇంటిపై ఏర్పడిన చెడు ప్రభావం తొలగిపోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి