Anasuya : బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణుల్లో అనసూయ ఒకరు. ఈమె ఓవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. ఈ మధ్యకాలంలో పలు వరుస చిత్రాల్లో అనసూయ భిన్నమైన పాత్రల్లో నటించి అలరించింది. పుష్ప సినిమాలో దాక్షాయణిగా మెప్పించిన ఈమె తరువాత రవితేజ ఖిలాడి మూవీలోనూ అలరించింది. ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన అప్‌డేట్స్ గురించి చెబుతుంటుంది.
ఇక అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు చాలా సందర్భాల్లో తెలియజేసింది. అయితే ఆమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్ అని తెలుసు. కానీ ఆయన ఏం చేస్తారు ? అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాబోలు అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన వృత్తి అది కాదు.
సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్షియర్. అలాగే ఫండింగ్ ప్లానర్. అంటే కంపెనీలకు ఫండ్స్ ఎలా రాబట్టాలో చెబుతుంటారన్నమాట. కానీ ఆయనను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుకుంటారు. ఇక అనసూయ త్వరలోనే పుష్ప రెండో పార్ట్ మూవీలో నటించనుండగా.. పలు చిత్రాలతోనూ ఈమె బిజీగా ఉంది. ఈమె నటిస్తున్న భీష్మ పర్వం అనే మళయాళం సినిమాతోపాటు పక్కా కమర్షియల్, రంగమార్తాండ మూవీలు త్వరలో విడుదల కానున్నాయి. దీంతోపాటు బుల్లితెర షోలతోనూ ఈమె ఫుల్ బిజీగా మారిపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…