గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anasuya : అనసూయ భర్త ఏం చేస్తారు ? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Anasuya : బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణుల్లో అనసూయ ఒకరు. ఈమె ఓవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. ఈ మధ్యకాలంలో పలు వరుస చిత్రాల్లో…

Anasuya : అనసూయ భర్త ఏం చేస్తారు ? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Anasuya : బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణుల్లో అనసూయ ఒకరు. ఈమె ఓవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. ఈ మధ్యకాలంలో పలు వరుస చిత్రాల్లో అనసూయ భిన్నమైన పాత్రల్లో నటించి అలరించింది. పుష్ప సినిమాలో దాక్షాయణిగా మెప్పించిన ఈమె తరువాత రవితేజ ఖిలాడి మూవీలోనూ అలరించింది. ఇక సోషల్‌ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. అలాగే తన అప్‌డేట్స్‌ గురించి చెబుతుంటుంది.

do you know what Anasuya  husband Sushank Bharadwaj will do
Anasuya

ఇక అనసూయ ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు చాలా సందర్భాల్లో తెలియజేసింది. అయితే ఆమె భర్త పేరు సుశాంక్‌ భరద్వాజ్‌ అని తెలుసు. కానీ ఆయన ఏం చేస్తారు ? అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాబోలు అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన వృత్తి అది కాదు.

సుశాంక్‌ భరద్వాజ్‌ ఫైనాన్షియర్‌. అలాగే ఫండింగ్‌ ప్లానర్‌. అంటే కంపెనీలకు ఫండ్స్‌ ఎలా రాబట్టాలో చెబుతుంటారన్నమాట. కానీ ఆయనను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుకుంటారు. ఇక అనసూయ త్వరలోనే పుష్ప రెండో పార్ట్‌ మూవీలో నటించనుండగా.. పలు చిత్రాలతోనూ ఈమె బిజీగా ఉంది. ఈమె నటిస్తున్న భీష్మ పర్వం అనే మళయాళం సినిమాతోపాటు పక్కా కమర్షియల్‌, రంగమార్తాండ మూవీలు త్వరలో విడుదల కానున్నాయి. దీంతోపాటు బుల్లితెర షోలతోనూ ఈమె ఫుల్‌ బిజీగా మారిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి