Jr NTR : ఎన్‌టీఆర్ ఎన్ని భాష‌లను అవ‌లీల‌గా మాట్లాడ‌గ‌ల‌డో తెలుసా..?

September 7, 2022 1:57 PM

Jr NTR : నందమూరి నట వారసుడిగా నిన్ను చూడాలని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్. మొదటి చిత్రం ఆశించిన మేరకు ఎన్టీఆర్ కి సక్సెస్ ను అందించలేకపోయింది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో మొదటి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్ తో ఎన్నో అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

ఇటీవల ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ కు సరిసాటి ఎవరూ లేరు. డైలాగ్ డెలివరీ గాని, డాన్స్ లో జోష్ గాని, ఫైట్స్ లో ఎన్టీఆర్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అంత అద్భుతంగా ఉంటుంది ఎన్టీఆర్ నటన. ఎన్టీఆర్ లో ఇవే కాకుండా మరెన్నో టాలెంట్స్  ఉన్నాయి. అదేంటంటే అనేక భాషల‌లో మాట్లాడడం.

do you know Jr NTR can speak different languages
Jr NTR

సాధారణంగా హీరోలు ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడడం చూస్తాము. పక్క రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ చేసేటప్పుడు ఇతర హీరోలు ఇంగ్లీషులోనే మాట్లాడతారు. ఆర్ఆర్ఆర్ చిత్రం అన్ని భాషల్లో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. తారక్ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కర్ణాటకలో కన్నడ భాషలో మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ముంబైలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో అనర్గళంగా హిందీ, చెన్నైలో తమిళ్ మాట్లాడటం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. తమ అభిమాన హీరో ఇన్ని భాషల్లో మాట్లాడటం చూసి ఫ్యాన్స్ సైతం తెగ సంబరపడిపోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment