గురువారం, జూన్ 11, 2026
జ్యోతిష్యం & వాస్తు

Items : మీ ఇంట్లో వీటిని ఖాళీగా అస‌లు ఉంచ‌కూడ‌దు.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..!

Items : చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన చక్కటి ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి. వాస్తు…

Items : మీ ఇంట్లో వీటిని ఖాళీగా అస‌లు ఉంచ‌కూడ‌దు.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..!

Items : చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన చక్కటి ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా ఇంట్లో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. వీటిని ఖాళీగా ఉంచితే సమస్యలు తప్పవని గుర్తు పెట్టుకోండి.

ఎప్పుడూ కూడా డబ్బులు దాచుకునే పర్సు, వాలెట్ వంటి వాటిని ఖాళీగా ఉంచకూడదు. చాలామంది రూపాయి కూడా లేకుండా ఊడ్చేస్తూ ఉంటారు. అలాంటి తప్పు చేయకూడదు. ఎంతో కొంత డబ్బులు ఉండేట్టు చూసుకోవాలి. లేదంటే ఎర్రటి వ‌స్త్రంలో గోమతి చక్రం, పసుపు కొమ్ము పర్సులో పెట్టుకుంటే ధనలక్ష్మి వస్తుంది. చాలామంది బాత్రూంలో బకెట్లను కూడా ఖాళీగా వదిలేస్తూ ఉంటారు.

do not keep these items empty in your house
Items

అలా ఎప్పుడూ చేయకూడదు. బకెట్లో ఎప్పుడూ వాటర్ ఉండాలి. లేదంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పవు. అదే విధంగా పూజకి వాడే కల‌శం వంటి వాటిని కూడా ఖాళీగా ఉంచకూడదు. నీళ్లు పోసి ఉంచాలి. లేదంటే గంగాజలం, తులసి ఆకులు వంటి వాటిని వేసి పెట్టాలి తప్ప ఖాళీగా పెట్టకూడదు.

ఎప్పుడూ కూడా ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీగా ఉండకూడదు. బియ్యం డబ్బాలో కొంచెం బియ్యం వదిలేయాలి. ఖాళీగా ఉంచితే అన్నపూర్ణా దేవికి కోపం వస్తుంది. చూశారు కదా ఎటువంటి తప్పులు చేయకూడద‌ని. ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇలా ఈ పొరపాట్లు జరగకుండా చూసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. సమస్యలు వంటివి ఏమీ కూడా రావు. చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలిగి సంతోషంగా ఉండడానికి వీల‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి