Divya Bharti : సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి దివ్యభారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో నాగార్జున సరసన తప్ప మిగిలిన స్టార్ హీరోలందరితోనూ కలిసి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఈమె ఇరవైకు పైగా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందింది.
అప్పట్లో ఈమె రోజుకు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో నిర్మాతలు ఈమెకున్న పాపులారిటీని తెలుసుకుని షాక్ అయ్యారు. అయితే ప్రమాదవశాత్తూ దివ్యభారతి మరణించడంతో సినిమా ఇండస్ట్రీ అద్భుతమైన నటిని కోల్పోయిందనే చెప్పాలి. దివ్యభారతికి చింతామణి అనే నాటకంలో నటించాలని ఎంతో ఆశగా ఉండేది. 1992లో దివ్యభారతి ప్రధానపాత్రలో చింతామణి సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
వారం రోజుల పాటు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న తర్వాత దివ్యభారతి అకాల మరణంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇలా దివ్య భారతి తన చివరి కోరిక నెరవేరకుండానే మరణించిందని చెప్పవచ్చు. ఇక ఈమె మరణానంతరం ఈ సినిమాను ఎవరూ చేయలేదు.ఇలా 19 సంవత్సరాల వయసులోనే ఇరవై చిత్రాలలో నటించి అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా దివ్యభారతి ఓ వెలుగు వెలిగిందనే చెప్పాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…