Divya Bharti : చివరి కోరిక తీరకుండానే మరణించిన దివ్యభారతి.. ఆమె కోరిక ఏమిటో తెలుసా ?

November 25, 2021 7:32 PM

Divya Bharti : సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి దివ్యభారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో నాగార్జున సరసన తప్ప మిగిలిన స్టార్ హీరోలందరితోనూ కలిసి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఈమె ఇరవైకు పైగా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందింది.

Divya Bharti died without completing her last wish

అప్పట్లో ఈమె రోజుకు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో నిర్మాతలు ఈమెకున్న పాపులారిటీని తెలుసుకుని షాక్ అయ్యారు. అయితే  ప్రమాదవశాత్తూ దివ్యభారతి మరణించడంతో సినిమా ఇండస్ట్రీ అద్భుతమైన నటిని కోల్పోయిందనే చెప్పాలి. దివ్యభారతికి చింతామణి అనే నాటకంలో నటించాలని ఎంతో ఆశగా ఉండేది. 1992లో దివ్యభారతి ప్రధానపాత్రలో చింతామణి సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

వారం రోజుల పాటు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న తర్వాత దివ్యభారతి అకాల మరణంతో ఈ సినిమా ఆగిపోయింది. ఇలా దివ్య భారతి తన చివరి కోరిక నెరవేరకుండానే మరణించిందని చెప్పవచ్చు. ఇక ఈమె మరణానంతరం ఈ సినిమాను ఎవరూ చేయలేదు.ఇలా 19 సంవత్సరాల వయసులోనే ఇరవై చిత్రాలలో నటించి అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా దివ్యభారతి ఓ వెలుగు వెలిగిందనే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now