Chiranjeevi : రీసెంట్‌గా ఏపీ అసెంబ్లీలో సినిమాలకి సంబంధించి రోజుకి నాలుగు ఆటలు మాత్రమే.. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేదు.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు.. మిడ్ నైట్ షోలు, బెన్‌ఫిట్ షోలు, స్పెషల్ షోలకు నో పర్మిషన్.. సామాజిక సేవాకార్యక్రమాలకు సంబంధించి నిధుల సేకరణ కోసమైతేనే బెన్‌ఫిట్ షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.
చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం టికెట్ల రేట్లు ఉండాలంటున్నారు చిరంజీవి. కాలానుగుణంగా.. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా టికెట్ల రేట్లు ఉండాలన్నది.. ఆయన ట్వీట్‌లో కనిపిస్తున్న అంశం.
దేశమంతా ఒకే ట్యాక్స్‌గా జీఎస్టీని ప్రభుత్వాలు వసూలు చేస్తున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం అంటున్నారు చిరంజీవి. దయచేసి టికెట్ రేట్లపై పునరాలోచించండి.. ప్రోత్సాహం ఉంటేనే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకుంటుందంటూ.. జగన్‌ను ట్యాగ్ చేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. మరి చిరంజీవి ట్వీట్‌పై జగన్ ఏమైనా స్పందిస్తారా.. అన్నది చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…