Dil Raju : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ.. థాంక్ యూ. ఇందులో నాగచైతన్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించగా.. మాళవికా నాయర్, అవికా గోర్‌లు ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ జూలై 22వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా థాంక్ యూ మూవీకి రూ.2.16 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలోనే సినిమా నిరాశ పరిచిందని.. దిల్ రాజుకు ఈ మూవీ భారీ నష్టాన్నే కలిగించిందని అంటున్నారు.
థాంక్ యూ మూవీకి గాను తొలి రోజు నైజాంలో రూ.72 లక్షలు, సీడెడ్‌లో రూ.20 లక్షలు, గుంటూరు రూ.10 లక్షలు, కృష్ణా రూ.12 లక్షలు, నెల్లూరు రూ.7 లక్షలు వచ్చాయి. అలాగే తెలంగాణ, ఏపీ కలిపి తొలి రోజు కలెక్షన్లు రూ.1.65 కోట్ల వరకు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్‌గా మత్తం రూ.3.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. రూ.2.16 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. అయితే మూవీ మొత్తం రూ.24 కోట్ల బిజినెస్ చేసిందని చెబుతుండగా.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.25 కోట్లు రావాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంటున్నారు.
తెలంగాణతోపాటు ఏపీలోనూ అనేక ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇది సినిమా కలెక్షన్లపై బాగానే ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. అయితే వర్షాలు తగ్గినప్పటికీ ఇంకో రెండు మూడు రోజుల తరువాత సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపరు. తొలి రోజే కలెక్షన్లు ఇలా ఉంటే మిగిలిన రోజుల్లో కలెక్షన్లు ఇంకా పడిపోతాయని భావించవచ్చు. అదే జరిగితే బ్రేక్ ఈవెన్ సాధించేందుకు చాలా కాలమే పడుతుంది. కానీ అప్పటి వరకు ఓటీటీలోనూ వచ్చేస్తుంది. కనుక ఈ మూవీతో మేకర్స్ కు నష్టమే వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కాస్తంత నష్టాన్ని భర్తీ చేయాలంటే సినిమాను ఓటీటీలో కాస్త ముందుగా రిలీజ్ చేయాలి. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…