Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణిగానే కాక.. హీరోయిన్‌గా కూడా రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈమె ఆయనతో కలసి కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో నటించారు. తరువాత కొన్నేళ్ల పాటు పవన్‌తో కలసి సహజీవనం చేశారు. అయితే అప్పట్లో ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండడంతో ఆయన పెళ్లిళ్లపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్‌ని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. దీంతో వివాదానికి తెర పడింది. అయితే మళ్లీ పవన్ రేణుకు కూడా విడాకులు ఇచ్చేశారు. రష్యా యువతి అన్నా లెజినివాను ఆయన వివాహ మాడారు.
అయితే తన విడాకులపై చాలా కాలం పాటు రేణు దేశాయ్ పెదవి విప్పలేదు. కానీ ఎట్టకేలకు ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఆమె అనేక విషయాలను వెల్లడించారు. ముందుగా పవనే తనను విడాకులు అడిగారని రేణు తెలిపారు. అయితే పవన్ రాజకీయాల్లో అప్పటికే యాక్టివ్‌గా ఉన్నారని.. కనుకనే ఆయన పరువుకు భంగం కలిగించొద్దని విడాకులకు అంగీకరించానని అన్నారు. అప్పుడు తన పిల్లలు అకీరా, ఆద్య చాలా చిన్నవారని వారిని తానే పెంచుతున్నానని.. అయితే విడాకులతో అనేక సమస్యలు వచ్చాయన్నారు. ఇద్దరు పిల్లలను ఒక తల్లిగా పెంచడం కష్టమైందన్నారు.
అయితే రేణు దేశాయ్ మాట్లాడిన ఈ వీడియో చాలా పాతది. కానీ దీన్ని ఇప్పుడు మళ్లీ కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండడం చూసి ఓర్వలేకే కొందరు ఇలా పాత వీడియోలను వైరల్ చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ చేస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. మరోవైపు పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బస్సు యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…