Renu Desai : ముందుగా ప‌వ‌నే విడాకులు అడిగారు.. రేణు దేశాయ్ పాత వీడియో వైర‌ల్‌..!

July 23, 2022 7:24 PM

Renu Desai : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణిగానే కాక‌.. హీరోయిన్‌గా కూడా రేణు దేశాయ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలుసు. ఈమె ఆయ‌న‌తో క‌ల‌సి కెరీర్ మొద‌ట్లో ప‌లు సినిమాల్లో న‌టించారు. త‌రువాత కొన్నేళ్ల పాటు ప‌వ‌న్‌తో క‌ల‌సి స‌హ‌జీవ‌నం చేశారు. అయితే అప్ప‌ట్లో ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉండ‌డంతో ఆయ‌న పెళ్లిళ్ల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్‌ని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. దీంతో వివాదానికి తెర ప‌డింది. అయితే మ‌ళ్లీ ప‌వ‌న్ రేణుకు కూడా విడాకులు ఇచ్చేశారు. ర‌ష్యా యువ‌తి అన్నా లెజినివాను ఆయ‌న వివాహ మాడారు.

అయితే త‌న విడాకులపై చాలా కాలం పాటు రేణు దేశాయ్ పెద‌వి విప్ప‌లేదు. కానీ ఎట్టకేల‌కు ఓ చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఆమె అనేక విషయాల‌ను వెల్ల‌డించారు. ముందుగా ప‌వ‌నే త‌న‌ను విడాకులు అడిగార‌ని రేణు తెలిపారు. అయితే ప‌వ‌న్ రాజ‌కీయాల్లో అప్ప‌టికే యాక్టివ్‌గా ఉన్నార‌ని.. క‌నుక‌నే ఆయ‌న ప‌రువుకు భంగం క‌లిగించొద్ద‌ని విడాకుల‌కు అంగీక‌రించాన‌ని అన్నారు. అప్పుడు త‌న పిల్ల‌లు అకీరా, ఆద్య చాలా చిన్న‌వార‌ని వారిని తానే పెంచుతున్నాన‌ని.. అయితే విడాకుల‌తో అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌న్నారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఒక త‌ల్లిగా పెంచ‌డం క‌ష్ట‌మైంద‌న్నారు.

Renu Desai said first Pawan Kalyan asked for divorce
Renu Desai

అయితే రేణు దేశాయ్ మాట్లాడిన ఈ వీడియో చాలా పాత‌ది. కానీ దీన్ని ఇప్పుడు మ‌ళ్లీ కొంద‌రు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉండ‌డం చూసి ఓర్వ‌లేకే కొంద‌రు ఇలా పాత వీడియోల‌ను వైర‌ల్ చేస్తున్నార‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రాద్ధాంతం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ చేస్తుండ‌గా.. ఈ మూవీ షూటింగ్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. మ‌ళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియ‌దు. మ‌రోవైపు ప‌వ‌న్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌స్సు యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now